మహారాష్ట్ర శాసన మండలి సభా నేతగా ఫడణవీస్‌

ABN , First Publish Date - 2022-08-18T10:47:48+05:30 IST

మహారాష్ట్ర శాసన మండలిలో సభా నాయకుడిగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్‌ నియమితులయ్యారు.

మహారాష్ట్ర శాసన మండలి సభా నేతగా ఫడణవీస్‌

ముంబై, ఆగస్టు 17: మహారాష్ట్ర శాసన మండలిలో సభా నాయకుడిగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్‌ నియమితులయ్యారు. బుధవారం ఆ రాష్ట్ర శాసన మండలిలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ఈ విషయం ప్రకటించారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు ఆయన కొత్త మంత్రులను సభకు పరిచయం చేశారు. మండలికి ఎన్నికైన కొత్త సభ్యులను ఫడణవీస్‌ పరిచయం చేశారు. శాసన సభలో సభా నాయకుడిగా ముఖ్యమంత్రి, శాసన మండలిలో సభా నాయకుడిగా ఉప ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. ఫడణవీస్‌ నాగ్‌పూర్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్కడ్‌కు అభినందనలు తెలుపుతూ శాసన మండలి తీర్మానం ఆమోదించింది. 

Updated Date - 2022-08-18T10:47:48+05:30 IST