Fahadh Faasil birthday: ఫహద్ పాజిల్‌ కెరీర్‌‌ను నిలబెట్టిన సినిమాలివే

Published: Mon, 08 Aug 2022 16:02:36 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Fahadh Faasil birthday: ఫహద్ పాజిల్‌ కెరీర్‌‌ను నిలబెట్టిన సినిమాలివే

నిర్మాత, దర్శకుడు పాజిల్ కుమారుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటుడు ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil). కొత్త పాత్రలు, వైవిధ్య భరిత సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. భాషతో సంబంధం లేకుండా పాత్ర నచ్చితే ఏ ఇండస్ట్రీలో అయినా నటిస్తాడు. ఫహద్ ఆగస్టు 8న పుట్టిన రోజు జరుపుకొంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడి కెరీర్‌ను నిలబెట్టిన సినిమాలపై ఓ లుక్కేద్దామా..  

Fahadh Faasil birthday: ఫహద్ పాజిల్‌ కెరీర్‌‌ను నిలబెట్టిన సినిమాలివే

విక్రమ్ (Vikram):

లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన సినిమా ‘విక్రమ్’. కోలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిందీ చిత్రం. ఈ మూవీలో కమల్ హాసన్ హీరోగా నటించగా, ఫహద్ పోలీసాఫీసర్ అమర్ పాత్రలో కనిపించాడు. ప్రభుత్వ అధికారుల సీరియల్ కిల్లింగ్స్ వెనుక ఉన్న మసుగు మనిషిని పట్టుకునే పోలీస్ బృందానికి నాయకత్వం వహించే పాత్రను పోషించాడు. 

Fahadh Faasil birthday: ఫహద్ పాజిల్‌ కెరీర్‌‌ను నిలబెట్టిన సినిమాలివే

తొండిముతాలుం దృక్సాక్షియం (Thondimuthalum Driksakshiyum): 

ఈ సినిమా క్రైమ్ డ్రామాగా తెరకెక్కింది. దిలీష్ పోతాన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో ఫహద్ దొంగగా నటించాడు. ఈ మూవీకి గాను అతడు ఉత్తమ సహాయనటుడిగా నేషనల్ ఫిలిం అవార్డ్‌ను గెలుచుకున్నాడు.  


Fahadh Faasil birthday: ఫహద్ పాజిల్‌ కెరీర్‌‌ను నిలబెట్టిన సినిమాలివే

జోజి (Joji):

విలియం షేక్ స్పియర్ ‘మాక్‌బెత్’ ను ఆధారంగా చేసుకుని ‘జోజి’ ని రూపొందించారు. ఈ చిత్రాన్ని దిలీష్ పోతాన్ తెరకెక్కించాడు. ఈ క్రైమ్ డ్రామా 2021లో విడుదలైంది.  

Fahadh Faasil birthday: ఫహద్ పాజిల్‌ కెరీర్‌‌ను నిలబెట్టిన సినిమాలివే

సూపర్ డీలక్స్ (Super Deluxe):

ఫహద్ ఫాజిల్ ‘సూపర్ డీలక్స్’ లో ముగిల్ పాత్రను పోషించాడు. సమంతకు భర్తగా నటించాడు. ఈ మూవీని త్యాగరాజన్ కుమార్‌రాజా తెరకెక్కించాడు. ఈ చిత్రం 2019లో విడుదలైన సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో నాలుగు కథలు ఉంటాయి. క్లైమాక్స్‌లో ఆ కథలు  అన్ని ఏవిధంగా లింక్ అయ్యాయి అనేదే సినిమా.    

Fahadh Faasil birthday: ఫహద్ పాజిల్‌ కెరీర్‌‌ను నిలబెట్టిన సినిమాలివే

కుంబలంగి నైట్స్ (Kumbalangi Nights):

ఈ సినిమాలో స్త్రీని ద్వేషించే భర్తగా నటించాడు. ఈ చిత్రం 2019లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈ మూవీలోని పాత్రకు గాను ఫహద్ కేరళ స్టేట్ ఫిలిం అవార్డ్ గెలుచుకున్నాడు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International