బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణ్యం

Aug 3 2021 @ 00:24AM
వినతిపత్రం అందజేస్తున్న ప్రగడ, పప్పల, నాయకులు

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ, మాజీ ఎమ్మెల్సీ పప్పల


ఎలమంచిలి, ఆగస్టు 2: ఉపాధి పథకం, ఇతర పనుల బిల్లులు ఇవ్వకపోతే కాంట్రాక్టర్లకు ఆత్మహత్యలే శరణ్యమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరావు, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు పేర్కొ న్నారు. బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రగడ మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం హయాంలో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. బిల్లులు విషయంపై న్యాయస్థానం ఆదేశాలను సైతం ప్రభుత్వం పట్టించుకోకోవడం విచారకరమన్నారు. ఎలమంచిలి నియోజకవర్గంలో రూ.7 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు మాట్లాడుతూ, ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనిస్తున్నారని, భవిష్యత్తులో వారే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. నవరత్నాలు అంటున్నారేగాని టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన వాటినే ప్రస్తుతం తగ్గించి ఇస్తున్నారన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీవో కార్యాలయాధికారికి అందజేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి దూలి రంగనాయకులు, మండల అధ్యక్షుడు కాండ్రకోట చిరంజీవి, పట్టణ అధ్యక్షుడు ఆడారి ఆదిమూర్తి, మండల నేతలు కొలుకులూరి విజయ్‌బాబు, దిన్‌బాబు, ఆడారి రమణబాబు, నాలుగు మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.