ఉద్యోగాల భర్తీలో విఫలం

ABN , First Publish Date - 2021-03-01T04:39:00+05:30 IST

నిరుద్యోగుల సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్‌.రమణ అన్నారు.

ఉద్యోగాల భర్తీలో విఫలం
విలేకరులతో మాట్లాడుతున్న రమణ

టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ


నాగర్‌కర్నూల్‌ టౌన్‌, ఫిబ్రవరి 28: నిరుద్యోగుల సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్‌.రమణ అన్నారు. ఆదివారం ఆయన నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్‌లో పార్టీ జిల్లా నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆరున్నరేళ్ల పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న సీఎం కేసీఆర్‌ 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చా మని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిరుద్యోగుల పట్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే భర్తీ చేసిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ సిట్టింగ్‌ అభ్యర్థి ఏ నాడూ శాశన మండలిలో గొంతెత్త లేదని, నాగేశ్వర్‌, ప్రస్తుత టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుస్తే కేవ లం పార్టీల కోసం పని చేస్తారే తప్ప నిరుద్యోగుల గురించి ఏ మాత్రం పట్టిం చుకోరన్నారు. ఇరవై ఏడేళ్ల రాజకీయ అనుభవంతో పాటు ఏడేళ్ల టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సుదీర్ఘ అనుభవం ఉన్న తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరుద్యోగుల పక్షాన గళమెత్తుతానని అన్నారు. కార్యక్రమంలో టీటీడీపీ పార్లమెంట్‌ కన్వీనర్‌ బి.రాములు, జిల్లా కన్వీనర్‌ మోపతయ్య, జిల్లా అధికార ప్రతినిధి కొప్పుల రమేష్‌, నాయకులు యాదగిరి, జాఫర్‌, రాము పాల్గొన్నారు.


ఓట్లడిగే అర్హత లేదు

నిరుద్యోగుల సమస్యలను గాలికొదిలేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లడిగే అర్హత లేదని టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో బహుజన క్లాస్‌ టీచర్స్‌ అసోసియేషన్‌(బీసీటీఏ) రాష్ట్ర మహాసభలను నిర్వహించారు. ఎల్‌.రమణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం అరుకొరగా భర్తీ చేసింద న్నారు. ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ చట్ట సభలు, ఉద్యోగుల ప్రమోష న్లలో రిజర్వేషన్లు సాధించడమే తన ధ్యేయమని అన్నారు. కార్యక్ర మంలో బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు, జిల్లా అధ్యక్షుడు సి.భాస్కర్‌, కార్యదర్శి వెంకటయ్య, టీడీపీ జిల్లా కన్వీనర్‌ మోపతయ్య, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పిడికిళ్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T04:39:00+05:30 IST