రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలి

ABN , First Publish Date - 2022-07-02T05:05:50+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ సోషల్‌ మీడియా, జాతీయ కన్వీనర్‌ అమిత్‌మలావ్యా అన్నారు. శుక్రవారం ఉదయం బీజేపీ దళితమోర్చా ప్రధాన కార్యదర్శి, కౌన్సిలర్‌ రవి ఇంట్లో అల్పాహారం చేసిన అనంతరం శివాలయంలో పూజలు చేసి, శివాజీ విగ్రహానికి పూలమాలలు వేశారు.

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలి
కామారెడ్డిలో దళిత మోర్చా నాయకుడి ఇంట్లో అల్పాహారం చేస్తున్న అమిత్‌ మాలావ్యా

కామారెడ్డి టౌన్‌, జూలై 1: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ సోషల్‌ మీడియా, జాతీయ కన్వీనర్‌ అమిత్‌మలావ్యా అన్నారు. శుక్రవారం ఉదయం బీజేపీ దళితమోర్చా ప్రధాన కార్యదర్శి, కౌన్సిలర్‌ రవి ఇంట్లో అల్పాహారం చేసిన అనంతరం శివాలయంలో పూజలు చేసి, శివాజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఈఎస్‌ఆర్‌ గార్డెన్‌లో ఓబీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనార్టీ మోర్చా నాయకులు, పదాధికారులు, బూత్‌ అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ కార్యకర్త కేంద్ర ప్రభుత్వ విజయాలను, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా బీజేపీకి అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్నారు. ప్రతీ కార్యకర్త బూత్‌స్థాయిలో పార్టీ బలోపేతం చేయడం కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్‌ మహిపాల్‌రెడ్డి, బీజేపీ నాయకులు వెంకట రమణా రెడ్డి, చిన్నరాజులు, భరత్‌, సురేష్‌, కౌన్సిలర్‌లు శ్రీకాంత్‌, నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో కుటుంబ పాలనకు స్వస్తి పలకాలి : విశాల్‌జోలే

బిచ్కుంద: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలనకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విశాల్‌జోలే అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సద్గురు బండయప్ప స్వామి కల్యాణ మండపంలో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చిన లక్ష రూపాయల పంట రుణమాఫీ ఇంత వరకు అమలు చేయలేదని, మూడు ఎకరాల భూమి పంపిణీ ఎక్కడ అందించలేదని అన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హన్మంత్‌షిండే అధికార పార్టీలో ఉన్న ఏ మండలంలోనైన డబుల్‌బెడ్‌రూంలను పేదవారికి కట్టించలేదని అన్నారు. దేశ, రాష్ట్రాల ప్రజల శ్రేయస్సు కోసం ప్రధానిమోదీ పని చేస్తున్నారని అందుకే ప్రజలు బీజేపీకి పట్టం కడుతున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షురాలు అరుణతార, మండల అధ్యక్షుడు క్రిష్ణారెడ్డి, సీనియర్‌ నాయకులు శీధర్‌, శక్తి కేంద్ర ఇన్‌చార్జీలు తదితరులు పాల్గొన్నారు.

భారత్‌ను విశ్వగురువు స్థానంలో నిలపడానికి యువమోర్చాలే అత్యంతకీలకం


ఫ గుజరాత్‌ రాష్ట్ర ఎంపీ భారతీబెన్‌షియాల్‌

సదాశివనగర్‌: భారతదేశాన్ని విశ్వగురువుస్థానంలో నిలపడానికి యువమోర్చాలే కీలకపాత్ర పోషించాలని గుజరాత్‌ రాష్ట్ర ఎంపీ భారతిబెన్‌షియాల్‌ అన్నారు. తెలంగాణ సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ యువమోర్చా మహిళా మోర్చా పదాధికారుల సమావేశంకు ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో కుటుంబపాలన రాష్ట్రం అధోగతి పాలయిందని అన్నారు. తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయడానికి అనుకూల పవనాలు వీస్తున్నాయని తెలిపారు. నియోజకవర్గంలో కేంద్రప్రభుత్వం అమలు చేసిన ప్రతీ పథకాన్ని ఇంటింటికి వివరించడానికి యువమోర్చా కార్యవర్గం, మహిళామోర్చాకార్యవర్గం ప్రణాళికలు చేసుకొని ముందుకు సాగాలన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయాలంటే బూత్‌ కమిటీలు పటిష్టంగా పని చేయాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో పైల కృష్ణారెడ్డి, మర్రి రాంరెడ్డి, పోతంగల్‌ కిషన్‌రావు, నరసింహారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌సీ మోర్చా అధ్యక్షుడు భూమేష్‌, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు చైతన్యగౌడ్‌, ఎంపీటీసీలు మహిపాల్‌యాదవ్‌, బైరవారెడ్డి, సర్పంచ్‌లు మమత, సంగారెడ్డి, రూపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుంది

- బీజేపీ సిక్కిం రాష్ట్ర అధ్యక్షుడు డీబీ. చౌహాన్‌

బాన్సువాడ టౌన్‌/బీర్కూర్‌: రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని బీజేపీ సిక్కిం రాష్ట్ర అధ్యక్షుడు డీబీ. చౌహాన్‌ ఆరోపించారు. శుక్రవారం బాన్సువాడ, బీర్కూర్‌లో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. బాన్సువాడ బీజేపీ కార్యకర్త ఇంట్లో ఆయన భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఈ సమావేశంలో కొత్తకొండ భాస్కర్‌ , అర్షపల్లి సాయిరెడ్డి, గంగారెడ్డి, శంకర్‌గౌడ్‌, శ్రీనివాస్‌, చిదరి సాయిలు, సాయిబాబా, గంగారాం, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. బీర్కూర్‌లో డీబీ చౌహాన్‌ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఇంకా తెలంగాణ ప్రజల కలలు మాత్రం నెరవేరలేదన్నారు. అందుకు కారణం రాష్ట్రంలో కుటుంబ, అవినీతి పాలననే విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే డబుల్‌ ఇంజన్‌తో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజే పీ నాయకులు మాల్యాద్రిరెడ్డి, చందు, సాయి, కిరణ్‌, పోచుగొండ, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T05:05:50+05:30 IST