నకిలీ స్వాములను పట్టుకున్న అయ్యప్పలు

ABN , First Publish Date - 2021-11-28T05:56:56+05:30 IST

భిక్షాటనలో డబ్బులు సంపాదనకు కొంతమంది వివిధ రకాల మాలలు ధరిస్తున్నారు.

నకిలీ స్వాములను పట్టుకున్న అయ్యప్పలు

విజయవాడ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : భిక్షాటనలో డబ్బులు సంపాదనకు కొంతమంది వివిధ రకాల మాలలు ధరిస్తున్నారు. ఇలా అయ్యప్ప మాల ధరించిన కొందరు నకిలీ స్వాములను నిజమైన అయ్య ప్పలు పట్టుకున్నారు. కానూరులోని శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి ఆధ్వర్యం లో వేణు గురుస్వామి ఇలాంటి వారిని గుర్తించడానికి ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. కానూరు పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్న వీరాస్వామి అనేవ్యక్తిని పట్టుకుని విచారించగా అసలు వాస్త వం వెలుగులోకి వచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వాములుగా తిరుగుతూ సాయంత్రం మామూలు అవతారాలు ఎత్తుతున్నారు. తమ సంస్థ పేరు చెప్పి అన్నదానానికి విరాళాలు వసూలు చేస్తున్నట్టు గుర్తించామని వేణు తెలిపారు. ఇలా చేస్తున్న ఇద్దరిని పోలీసులకు అప్పగించామన్నారు. ఇలా స్వామిమాలలో వచ్చి భిక్షాటన చేస్తున్న వారికి భక్తులు విరాళాలు ఇవ్వొద్దని వేణు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-11-28T05:56:56+05:30 IST