ఫొటోలో చూసింది ఒకరిని.. పెళ్లి చేసుకుంది మరొకరని.. తెల్లారాక భార్యను చూసి నివ్వెరపోయిన భర్త.. నువ్వెవరని ఆమెను నిలదీస్తే..

ABN , First Publish Date - 2022-05-30T19:32:21+05:30 IST

ఆ యువకుడు తన పెళ్లి కోసం మధ్యవర్తిని ఆశ్రయించాడు.. అతను రూ.5 లక్షలకు డీల్ సెట్ చేసుకుని ఓ యువతి ఫొటో చూపించాడు..

ఫొటోలో చూసింది ఒకరిని.. పెళ్లి చేసుకుంది మరొకరని.. తెల్లారాక భార్యను చూసి నివ్వెరపోయిన భర్త.. నువ్వెవరని ఆమెను నిలదీస్తే..

ఆ యువకుడు తన పెళ్లి కోసం మధ్యవర్తిని ఆశ్రయించాడు.. అతను రూ.5 లక్షలకు డీల్ సెట్ చేసుకుని ఓ యువతి ఫొటో చూపించాడు.. ఆ యువతి నచ్చడంతో ఆ యువకుడు మధ్యవర్తికి రూ.3 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించాడు.. నెల రోజుల తర్వాత వారిద్దరికీ పెళ్లి జరిగింది.. అయితే తను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన భార్యను చూసి ఆ యువకుడు నివ్వెరపోయాడు.. ఎందుకంటే తను ఫొటోలో చూసిన అమ్మాయి, పెళ్లి చేసుకున్న అమ్మాయి ఒకరు కాదు.. మోసపోయానని తెలుసుకుని ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. 




రాజస్థాన్‌లోని జాలోర్‌కు చెందిన సోహాన్ సింగ్ అనే యువకుడు తన పెళ్లి కోసం మధ్యవర్తి గణ్‌పత్ దంతియా అనే వ్యక్తిని ఆశ్రయించాడు. తనకు తెలిసిన ఓ యువతి ఉందని, పెళ్లి సంబంధం కుదర్చాలంటే రూ.5 లక్షలు ఖర్చవుతుందని దంతియా చెప్పాడు. ఆ యువతి ఫొటో చూపించాడు. ఫొటోలో యువతి నచ్చడంతో దంతియాకు సోహాన్ రూ.3 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించాడు. పెళ్లి షాపింగ్ పూర్తి చేసి వధువు కోసం బంగారం కొన్నాడు. గత శుక్రవారం రాత్రి ఇద్దరికీ పెళ్లి జరిగింది. అయితే అమ్మాయికి విపరీతంగా మేకప్ వేసెయ్యడంతో పాటు మొహం కవర్ చేయడంతో సోహాన్ సరిగ్గా పోల్చుకోలేకపోయాడు. 


తర్వాతి రోజు ఉదయం తన ఇంట్లో ఉన్న మహిళను చూసి సోహాన్ నివ్వెరపోయాడు. ఎందుకంటే ఫొటోలో చూపించిన యువతి వేరు, తన ఇంట్లో ఉన్న యువతి వేరు. ఫొటోలో ఉన్న యువతికి 20 ఏళ్లు అయితే, తను పెళ్లి  చేసుకున్న మహిళకు 35 ఏళ్లు. షాకైన సోహాన్ తన ఇంట్లో ఉన్న మహిళను ప్రశ్నించాడు. తనకు దంతియా రూ.30 వేలు ఇచ్చి పెళ్లి చేసుకోమని చెప్పాడని చెప్పింది. షాకైన సోహాన్ కుటుంబ సభ్యులు ఆ మహిళను పోలీసులకు అప్పగించి దంతియాపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-05-30T19:32:21+05:30 IST