మళ్లీ కదలిక

ABN , First Publish Date - 2020-11-29T04:50:33+05:30 IST

జిల్లా వైద్యఆరోగ్యశాఖలోని ఫార్మాసిస్టు, ల్యాబ్‌టెక్నీషియన్లు, స్టాఫ్‌నర్శుల పోస్టుల భర్తీలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై పోలీసులు మరికొంతమందిని విచారించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఉద్యోగం పొందిన ఓ అభ్యర్థినిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి విచారణ కొద్దిరోజులు నిలిచిపోగా.. శనివారం మళ్లీ దర్యాప్తు ప్రారంభమైంది.

మళ్లీ కదలిక




నకిలీ సర్వీస్‌ సర్టిఫికెట్ల వ్యవహారంపై పోలీసుల విచారణ

మహిళా అభ్యర్థినుల కాల్‌రికార్డింగ్‌ ఆధారంగా దర్యాప్తు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, నవంబరు 28)

జిల్లా వైద్యఆరోగ్యశాఖలోని ఫార్మాసిస్టు, ల్యాబ్‌టెక్నీషియన్లు, స్టాఫ్‌నర్శుల పోస్టుల భర్తీలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై పోలీసులు మరికొంతమందిని విచారించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఉద్యోగం పొందిన ఓ అభ్యర్థినిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి విచారణ కొద్దిరోజులు నిలిచిపోగా.. శనివారం మళ్లీ దర్యాప్తు ప్రారంభమైంది. జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది అటెండర్లను, డేటా ఎంట్రీ ఆపరేటర్లను శనివారం రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో విచారణ చేశారు. సర్వీస్‌ సర్టిఫికెట్ల ర్యాకెట్‌లో అసలు సూత్రధారి ఎవరు?.. నకిలీలకు వెనుక జరుగుతున్న తతంగంపై ఆరా తీసినట్టు తెలిసింది. ఓ మహిళా  అభ్యర్థిని... మరో అభ్యర్థినితో మాట్లాడిన కాల్‌ రికార్డింగ్‌ కూడా పోలీసులకు చేరింది. ‘సర్వీస్‌ సర్టిఫికెట్‌లు మనం జతపరచాల్సిన అవసరం లేదని.. అన్నింటికీ డబ్బులిస్తే ఫలానా ఉద్యోగి అన్నీ టోకుగా సమకూర్చి ఉద్యోగం వచ్చేలా చేస్తారు’ అని ఆ రికార్డింగ్‌లో ఉంది. దీనిపై అభ్యర్థుల వారీగా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నమోదైన ఈ కేసులో ఏ-1 ఎవరన్నదీ కొలిక్కి వస్తేవిచారణ పూర్తయినట్లేనని.. అనంతరం అరెస్ట్‌ల పర్వం ఉంటుందని పోలీసులు వెల్లడిస్తున్నారు. 



Updated Date - 2020-11-29T04:50:33+05:30 IST