కస్టమర్ కేర్ పేరుతో 300 మంది బ్యాంకు ఖాతాదారులను దోచుకున్న కేటుగాళ్లు.. అదెలాగంటే..

ABN , First Publish Date - 2022-02-16T06:57:52+05:30 IST

టెక్నాలజీతో ప్రపంచం ఎన్నో రంగాలలో అభివృద్ధి చెందింది. అలాగే అభివృద్ధి చెందిన టెక్నాలజీ ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. తాజాగా ఒక బ్యాంకు కస్టమర్లు తమ ఫిర్యాదులను తెలియజేయడానికి బ్యాంకు కస్టమర్ కేర్ నెంబర్‌కు ఫోన్ చేయగా.. వారిని ఫిర్యాదు సేకరణ పేరుతో కొందరు మోసగాళ్లు బ్యాంకు అకౌంట్‌లో ఉన్న డబ్బంతా కాజేశారు...

కస్టమర్ కేర్ పేరుతో 300 మంది బ్యాంకు ఖాతాదారులను దోచుకున్న కేటుగాళ్లు.. అదెలాగంటే..

టెక్నాలజీతో ప్రపంచం ఎన్నో రంగాలలో అభివృద్ధి చెందింది. అలాగే అభివృద్ధి చెందిన టెక్నాలజీ ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. తాజాగా ఒక బ్యాంకు కస్టమర్లు తమ ఫిర్యాదులను తెలియజేయడానికి బ్యాంకు కస్టమర్ కేర్ నెంబర్‌కు ఫోన్ చేయగా.. వారిని ఫిర్యాదు సేకరణ పేరుతో కొందరు మోసగాళ్లు బ్యాంకు అకౌంట్‌లో ఉన్న డబ్బంతా కాజేశారు. అలా ఒకరిద్దరిని కాదు.. 300 మందికి పైగా కస్టమర్లను దోచేశారు. 


వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన శాలీన్ శర్మ అనే మహిళ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఆమె ఖాతా ఉంది. అయితే బ్యాంకులో ఒక పాలసీ దృష్ట్యా షాలీన్ శర్మకు ఒక సమస్య రావడంతో.. ఆమె అన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలనుకుంది. అలా అక్టోబర్ 2021 సంవత్సరంలో ఆమె గూగుల్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంకు కస్టమర్ కేర్ నెంబర్‌ కోసం సెర్చ్ చేసింది. అందులో మొదటి లింకులో కనిపించిన నెంబరుకు ఆమె కాల్ చేయగా.. ఎదుటి వ్యక్తి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌గా ఆమెతో మాట్లాడాడు. 


శాలీన్ శర్మ సమస్య విని ఆమె ఒక ఆన్ లైన్ ఫార్మ్ నింపాలని చెప్పాడు. అలాగే మరొక యాప్ కూడా డౌన్ ‌లోడ్ చేసుకోవాలని సూచించాడు. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌ చెప్పినట్లు ఆమె చేసింది. అయితే యాప్ డౌన్ లోడ్ చేసుకున్నాక ఫోన్‌కు వచ్చిన ఓటీపీ అడిగాడు. శాలీన్ శర్మ ఆ ఓటీపీ నెంబర్ అతనికి చెప్పిన కొద్ది నిమిషాల్లోగా ఆమె అకౌంట్‌లో నుంచి డబ్బంతా(రూ.3 లక్షలకు పైగా) మాయమైంది. ఆ తరువాత ఆమె మళ్లీ ఆ కస్టమర్ కేర్ నెంబర్‌కు కాల్ చేస్తే.. ఎవరూ కాల్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆందోళన చెందిన శాలీన్ శర్మ బ్యాంకు అధికారులను సంప్రదించింది. కానీ వారు దీని గురించి తమ వద్ద సమాచారం లేదని చెప్పారు. 


ఏం చేయాలో తెలియక శాలీన్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె కేసుని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ ఆపరేషన్స్(IFSO) విభాగానికి ట్రన్స్‌ఫర్ చేశారు. శాలీన్ శర్మ లాగా దేశం మొత్తం మీద 300 మందికి పైగా ఆ నకిలీ కస్టమర్ కేర్ నెంబర్ ద్వారా మోసపోయారు. ఇలాంటిదే మరో కేసులో ఒక వ్యక్తి దాదాపు రూ.26 లక్షలు పోగొట్టుకున్నాడు. IFSO ఇలాంటి కేసుల విచారణ కోసం ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేసింది. అలా మూడు నెలల తరువాత ఈ నకిలీ కస్టమర్ కేర్ గ్యాంగ్ గురించి 


పోలీసులకు సమాచారం అందింది. ఆ ముఠాకు సంబంధించి ముగ్గురిని పశ్చిమ బెంగాల్ నుంచి అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఆ ముఠా మాస్టర్ మైండ్ సౌరభ్ అనే వ్యక్తిని IFSO ప్రశ్నించగా.. అతడు ఈ ఇద్దరు మహిళ బ్యాంకు అకౌంట్లని ఉపయోగించుకొని ఖాతాదారులని మోసం చేసేవాడని అంగీకరించాడు. దానికి బదులుగా ఆ మహిళలకు 20 కమీషన్ ఇచ్చేవాడు.


గూగుల్ SEO ద్వారా తమ ఫేక్ కస్టకర్ కేర్ ఫోన్ నెంబర్‌ని గూగుల్ సెర్చ్‌లో టాప్‌లోకి తీసుకొచ్చేవాడు. దీంతో ఎవరైనా కస్టమర్ కేర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తే వారి నెంబర్ ముందుగా కనుబడుతుంది. బ్యాంకు ఖాతాదారుల చేత యాప్ డౌన్ లోడ్ చేయించి.. దాని ఓటిపి తీసుకుంటారు. ఆ ఓటిపి ద్వారా ఖాతాదారుల అకౌంట్ నుంచి నిమిషాల్లో డబ్బు కాజేస్తారు. ఆన్ లైన్ ఫార్మ్‌లో ఫిర్యాదు వివరాలు తెలియజేయమని మోసగాళ్లు అడుగుతారు. ఆ ఫార్మ్‌పై బ్యాంకు లోగో ఉండడంతో ఖాతా దారులు త్వరగా మోసగాళ్ల ఉచ్చులో పడిపోతారు.



Updated Date - 2022-02-16T06:57:52+05:30 IST