పక్కా ప్లాన్‌తో డాక్టర్‌ వేషంలో ICUలోకి వెళ్లాడు.. తీరా చూస్తే ఇలా అడ్డంగా దొరికిపోయాడు..!

ABN , First Publish Date - 2022-05-21T15:05:57+05:30 IST

తెల్లకోటు, బూటు వేసుకున్నాడు. మెడలో స్టెతస్కోప్‌తో నేరుగా ఆస్పత్రి ఐసీయూ (ICU)లోకి వెళ్లాడు...

పక్కా ప్లాన్‌తో డాక్టర్‌ వేషంలో ICUలోకి వెళ్లాడు.. తీరా చూస్తే ఇలా అడ్డంగా దొరికిపోయాడు..!

  • డాక్టర్‌ వేషంలో ఐసీయూలోకి..
  • టెస్ట్‌లకు రూ.15,500 కట్టాలంటూ రోగి సహాయకుడికి ఫోన్‌ 
  • బెడిసికొట్టిన పథకం.. అరెస్ట్‌

హైదరాబాద్ సిటీ/పంజాగుట్ట : తెల్లకోటు, బూటు వేసుకున్నాడు. మెడలో స్టెతస్కోప్‌తో నేరుగా ఆస్పత్రి ఐసీయూ (ICU)లోకి వెళ్లాడు. డబ్బు (Money)కోసం రోగి సహాయకుడిని బురిడీ కొట్టిద్దామని ప్రయత్నించి పోలీసులకు (Police) చిక్కాడు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్‌ జహీరుద్దీన్‌ (19) ఈ నెల 16న బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-01లోని ఓ ఆస్పత్రికి (Hospital) వచ్చాడు. సరాసరి మూడో అంతస్తులోని ఎస్‌ఐసీయూ వార్డులోకి వెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతున్న రోగి సహాయకుడి ఫోన్‌ నెంబర్‌ తీసుకొని, అత్యవసరంగా పరీక్షలు చేయాలని, రూ. 15,500 వెంటనే చెల్లించాలని చెప్పాడు. దాంతో నివ్వెరపోయిన బాధితుడు తాము ఈఎస్ఐ (ESI) పథకంలో చేరామని, డబ్బులు ఎందుకు కట్టాలని ప్రశ్నించాడు.


ఈఎస్ఐ కార్డు ద్వారా వచ్చిన వారికి రూ.12,500 రాయితీ ఇస్తున్నామని, మిగతా డబ్బు చెల్లించాలని చెప్పాడు. అనుమానం వచ్చిన రోగి (Patient) సంబంధీకులు ఆస్పత్రి వర్గాల దృష్టికి విషయం తీసుకెళ్లారు. వారు ఆరా తీయగా అతడు నకిలీ డాక్టర్‌ (Fake Doctor) అని తేలింది. ఆస్పత్రి సెక్యూరిటీ అధికారి సాగర్‌ చారి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ (CCTV Footage), సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడిని శుక్రవారం అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2022-05-21T15:05:57+05:30 IST