నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్..

ABN , First Publish Date - 2020-11-29T04:13:38+05:30 IST

పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ఫెయిలైన విద్యార్ధులకు నకిలీ మార్కుల జాబితాలు, అటెంప్ట్ సర్టిఫికెట్లను సృష్టిస్తున్న ...

నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్..

వడోదర: పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ఫెయిలైన విద్యార్ధులకు నకిలీ మార్కుల జాబితాలు, అటెంప్ట్ సర్టిఫికెట్లను సృష్టిస్తున్న ఓ ముఠాను వడోదర పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి కంప్యూటర్లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. పలు యూనివర్సిటీల పేరుతో ఈ ముఠా నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు కూడా తయారు చేస్తున్నట్టు గుర్తించారు. దేశంలోని దాదాపు 12 యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను వీరు తయారు చేస్తున్నట్టు తేలిందని పోలీసులు తెలిపారు. ‘‘పలు యూనివర్సిటీలకు చెందిన నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, మార్కుల జాబితాలను ఈ ముఠా తయారుచేస్తోంది. గత 7-8 ఏళ్లుగా ఇది కొనసాగుతున్నట్టు గుర్తించాం...’’ అని వడోదర పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రాకెట్‌లో ఇంకా ఎంత మంది ప్రమేయం ఉందన్నదానిపైనా ఆరా తీస్తున్నారు. ఈ స్కామ్‌లో ఆయా యూనివర్సిటీలకు చెందిన సిబ్బంది ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం నకిలీ రాకెట్ సూత్రధారి దిలీప్ మోహితేను అరెస్ట్ చేసిన  గోత్రి క్రైం బ్రాంచ్ పోలీసులు.. ఇటీవల మరో ముగ్గురిని అరెస్ట్ చేయడంతో ఫేక్ డిగ్రీ రాకెట్ వెలుగులోకి వచ్చింది. 

Updated Date - 2020-11-29T04:13:38+05:30 IST