పోలీస్ వేషం వేసిన దొంగ‌లు.. ఆ గ్రామంలో ఏం దొంగ‌త‌నం చేశారంటే..

ABN , First Publish Date - 2022-01-02T10:32:03+05:30 IST

అర్ధ‌రాత్రి వేళ‌ ఒక గ్రామంలోని ఇంటి త‌లుపులు ఎవ‌రో గ‌ట్టిగా త‌ట్టారు. ఇంటి య‌జ‌మానులు వెళ్లి తలుపులు తీసేస‌రికి బ‌య‌ట నుంచి పోలీసులు వ‌చ్చారు. పోలీస్ కానిస్టేబుళ్ల వేషంలో ఉన్న‌ న‌లుగురు ఇంట్లో బ‌ల‌వంతంగా ప్ర‌వేశించారు...

పోలీస్ వేషం వేసిన దొంగ‌లు.. ఆ గ్రామంలో ఏం దొంగ‌త‌నం చేశారంటే..

అర్ధ‌రాత్రి వేళ‌ ఒక గ్రామంలోని ఇంటి త‌లుపులు ఎవ‌రో గ‌ట్టిగా త‌ట్టారు. ఇంటి య‌జ‌మానులు వెళ్లి తలుపులు తీసేస‌రికి బ‌య‌ట నుంచి పోలీసులు వ‌చ్చారు. పోలీస్ కానిస్టేబుళ్ల వేషంలో ఉన్న‌ న‌లుగురు ఇంట్లో బ‌ల‌వంతంగా ప్ర‌వేశించారు. ఇంట్లో ఉన్న నాలుగు మేక‌లును ఎత్తుకొని జీపులో వేసుకొని పోయారు. 


తెల్ల‌వారాక తెలిసింది. గ్రామంలోని చాలా ఇళ్ల‌లో ఇలాగే పోలీసులు మేక‌లు ఎత్తుకుపోయార‌ని. దీంతో గ్రామ పెద్ద‌లు పోలీస్ స్టేష‌న్‌కి వెళ్లి పోలీసుల‌ను నిల‌దీశారు. అప్పుడు వారంద‌రూ నిజం తెలుసుకొని షాక‌య్యారు. రాత్రి పోలీసు యూనిఫాం వేసుకొని న‌కిలీ పోలీసులు తిరుగుతున్నార‌ని. ఆ న‌కిలీ పోలీసులు ఇప్ప‌టికే ప‌క్క గ్రామం నుంచి కూడా మేక‌లు ఎత్తుకెళ్లార‌ని పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న బీహార్ రాష్ట్రంలో ఛాప్రా జిల్లాలో జ‌రిగింది.


ప్ర‌స్తుతం పోలీసులు ఆ మేక‌దొంగ‌ల కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2022-01-02T10:32:03+05:30 IST