Lovers: ఇదెక్కడి ప్రేమ పుష్పా.. లవర్ మీద ప్రేమ ఉండాలమ్మా.. కానీ మరీ ఈరేంజ్‌లో ఉంటే..

ABN , First Publish Date - 2022-05-04T21:59:39+05:30 IST

ఆ అమ్మాయి, అబ్బాయి Lovers. Btech Third Year చదువుతున్నారు. మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. Online Bettingలో ఆ యువకుడు చాలా డబ్బు పోగొట్టుకుని..

Lovers: ఇదెక్కడి ప్రేమ పుష్పా.. లవర్ మీద ప్రేమ ఉండాలమ్మా.. కానీ మరీ ఈరేంజ్‌లో ఉంటే..

కోయంబత్తూర్: ఈ అమ్మాయి, అబ్బాయి Lovers. Btech Third Year చదువుతున్నారు. మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. Online Bettingలో ఆ యువకుడు చాలా డబ్బు పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు. ఆ పరిణామంతో ఈ లవర్స్ ఇద్దరూ Easy Money కోసం దొంగతనాల బాట పట్టారు. Chain Snatching చేసే దొంగలుగా మారారు. చివరకు అరెస్ట్ అయి కటకటాల పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమయంపాళ్యంకు చెందిన ఏ ప్రశాంత్, రామనాథపురానికి చెందిన హెచ్.తేజస్విని ఒక ప్రైవేట్ కాలేజ్‌లో బీటెక్ చదువుతున్నారు. మూడేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఒకరికొకరు బాగా దగ్గరయ్యారు.



ప్రశాంత్ ఇటీవల ఆన్‌లైన్ బెట్టింగ్స్‌కు అలవాటు పడ్డాడు. ఆ డబ్బు కోసం రూ.15 లక్షలు వాళ్ల దగ్గరా, వీళ్ల దగ్గరా అప్పు చేసి మరీ బెట్టింగ్స్‌లో పెట్టాడు. ఆన్‌లైన్ బెట్టింగ్స్‌లో పెట్టిన ఆ డబ్బంతా పోగొట్టుకున్నాడు. అప్పు ఇచ్చిన వాళ్ల దగ్గర నుంచి ఒత్తిడి పెరిగింది. ప్రశాంత్ ఈ విషయాన్ని తన ప్రియురాలు తేజస్వినితో చెప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి ఈజీ మనీ కోసం దొంగతనాల బాట పట్టారు. తేజస్వినికి స్కూటీ ఉంది. ఆ స్కూటీపై తొండముత్తూరు వైపు వెళ్లారు. తొండముత్తూరు ఫైర్ స్టేషన్ దగ్గర్లో మేకలు మేపుకుంటున్న ఒక వృద్ధురాలు మధ్యాహ్నం 2.30 సమయంలో వీరికి రోడ్డు పక్కన కనిపించింది. ఆ వృద్ధురాలి వద్దకు స్కూటీపై వెళ్లిన ప్రశాంత్, తేజస్విని అడ్రస్ అడిగినట్టుగా నటించారు. అడ్రస్ అడుగుతున్నట్టే అడుగుతూ వృద్ధురాలి మెడలో ఉన్న గోల్డ్ చైన్‌ను దొంగిలించి స్కూటీపై ప్రశాంత్, తేజస్విని పరారయ్యారు.



వృద్ధురాలి ఫిర్యాదుతో పోలీసులు విచారణ జరిపారు. CCTV Footage ఆధారంగా స్కూటీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను గుర్తించారు. ఆ నంబర్ తేజస్విని పేరుతో రిజిస్ట్రేషన్ అయిందని తేల్చారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. కొన్ని నెలల క్రితం.. ప్రశాంత్ తండ్రి ఇంట్లో ఉన్న బంగారం కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణలో ఆ బంగారం కూడా ప్రశాంత్ దొంగిలించి అమ్ముకుని ఆ డబ్బును ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. ప్రశాంత్ తన లవర్ తేజస్విని బంగారం కూడా అమ్మి మరీ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బు తగలేసుకున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు ప్రశాంత్, తేజస్విని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో ఆసక్తికర విషయం ఏంటంటే.. ప్రశాంత్, తేజస్విని ఇద్దరి తల్లిదండ్రులూ వ్యాపారస్తులే.

Read more