ట్రాఫిక్‌ కష్టాలు

ABN , First Publish Date - 2021-01-22T05:26:20+05:30 IST

మినీట్రక్కుల ర్యాలీ నేపథ్యంలో శ్రీకాకుళం నగరంలో గురువారం ట్రాఫిక్‌ కష్టాలు ఎదురయ్యాయి. కేఆర్‌ స్టేడియంలో రేషన్‌ సరుకుల సరఫరా కోసం మినీ ట్రక్కులను ప్రారంభించారు. అనంతరం ట్రక్కులతో ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీసులు, అధికారులు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేశారు. కేఆర్‌ స్టేడియం నుంచి ర్యాలీ ప్రారంభమై.. పాలకొండ రోడ్డులో రిమ్స్‌ రోడ్డు గుండా కేఆర్‌ స్టేడియానికి 530వాహనాలు ర్యాలీగా చేరుకున్నాయి. ర్యాలీ కోసం బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాల రాకపోకలను కొన్ని గంటల పాటు దారి మళ్లించారు. దీంతో పాలకొండ రోడ్డు నుంచి బలగ మీదుగా శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చేందుకు వాహనదారులు, ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.

ట్రాఫిక్‌ కష్టాలు
అంబేద్కర్‌ జంక్షన్‌ వద్ద వాహనదారుల ఇబ్బందులు..

ప్రజలకు తప్పని ఇబ్బందులు

రోడ్డుపై బైఠాయించి.. కూన రవికుమార్‌ నిరసన 

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జనవరి 21: మినీట్రక్కుల ర్యాలీ నేపథ్యంలో శ్రీకాకుళం నగరంలో గురువారం ట్రాఫిక్‌ కష్టాలు ఎదురయ్యాయి.   కేఆర్‌ స్టేడియంలో రేషన్‌ సరుకుల సరఫరా కోసం మినీ ట్రక్కులను ప్రారంభించారు. అనంతరం ట్రక్కులతో ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీసులు, అధికారులు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేశారు. కేఆర్‌ స్టేడియం నుంచి ర్యాలీ ప్రారంభమై.. పాలకొండ రోడ్డులో రిమ్స్‌ రోడ్డు గుండా కేఆర్‌ స్టేడియానికి 530వాహనాలు ర్యాలీగా చేరుకున్నాయి. ర్యాలీ కోసం బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాల రాకపోకలను కొన్ని గంటల పాటు దారి మళ్లించారు. దీంతో పాలకొండ రోడ్డు నుంచి బలగ మీదుగా శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చేందుకు వాహనదారులు, ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. బొందిలీపురం మీదుగా ఇలిసిపురం నుంచి డేఅండ్‌నైట్‌ జంక్షన్‌ వరకు మాత్రమే చేరుకోగలిగారు. మధ్యాహ్నం వరకు నగరంలో వాహనదారుల కష్టాలు అన్నీఇన్నీకావు. గొలివి ఆసుపత్రి, బలగ స్టేట్‌బ్యాంక్‌, బావాజీనగర్‌, హడ్కోకాలనీ  తదితర ప్రాంతాల వారు రాకపోకలకు అవస్థలు పడ్డారు. ర్యాలీ నిర్వహించిన మార్గంలో వస్తున్న శ్రీకాకుళం టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు కూన రవికుమార్‌ వాహనాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ.. కూన రవికుమార్‌ డేఅండ్‌నైట్‌ జంక్షన్‌లో రోడ్డుపై బైఠాయించారు.  సక్రమంగా ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు తీసుకోలేదని.. ప్రజలు, విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులఉ ఆయనకు సర్దిచెప్పి.. ట్రాఫిక్‌ ఆంక్షలను కొంతమేర సవరించారు.

 

Updated Date - 2021-01-22T05:26:20+05:30 IST