Advertisement

మట్కా జోరు.. మహారాష్ట్ర సరిహద్దుల్లో విచ్చలవిడిగా మట్కా

Sep 25 2020 @ 01:14AM


వ్యసనానికి బానిసలై కుటుంబాల నాశనం


బోధన్‌, సెప్టెంబరు 24 : అనేక కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టి రోడ్డుకీడుస్తున్న మట్కా దందా గ్రామీణ ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది. మహారాష్ట్ర సరిహద్దుల్లో మట్కా విచ్చలవిడిగా సాగ డంతో అటు నిర్వాహకులు, ఇటు ఆడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. బోధన్‌ డివిజన్‌ పరిధి లోని రెంజల్‌, బోధన్‌, కోటగిరి మండలాలు మహా రాష్ట్రకు సరిహద్దునే ఉండడం నవీపేట మండలానికి మహారాష్ట్ర నుంచి రాకపోకలు అధికంగా ఉండ డంతో మట్కారాయుళ్లు సరిహద్దు మండలాలలో అడ్డాలుగా ఎంచుకొని విచ్చలవిడిగా విస్తరింపజేస్తు న్నారు. సులువుగా డబ్బు సంపాదించవచ్చన్న తప్పు డు ఆలోచనలతో బానిసలైన వ్యక్తులు మట్కాకు బా నిసలుగా మారి లక్షలాది రూపాయల ను కోల్పోతు న్నారు. మట్కాకు బానిసలుగా మారి సర్వస్వం కోల్పోతున్నారు. 


సరిహద్దు మండలాలే టార్గెట్‌...

మహారాష్ట్రలో మట్కాదందా విచ్చలవిడి కావడం తో అక్కడి నుంచి మట్కారాయుళ్లు సరిహద్దు మం డలాలకు దందాను విస్తరింపజేస్తున్నారు. డివిజన్‌ పరిధిలోని రెంజల్‌, బోధన్‌, కోటగిరి మండలాలు మ ట్కాకు అడ్డాలుగా మారాయి. మరోవైపు నవీపేట మండలానికి ధర్మాబాద్‌, నిజామాబాద్‌ రైళ్ల రాక పో కలు ఉండడంతో మట్కారాయుళ్లు రైళ్లను మట్కా వ్యాపారం విస్తరణకు ప్రధాన అస్త్రంగా ఎంచుకు న్నారు. మట్కా చిట్టీలు నిత్యం రైళ్ల ద్వారా మట్కా ఏ జెంట్‌ల వద్దకు చేరుకుంటున్నాయి. గ్రామాల్లో కిల్లీకొ ట్లు, హోటళ్లు, చిన్న చితకా అడ్డాలు మట్కా దందాకు ప్రధాన కేంద్ర బిందువులుగా మారాయి. బోధన్‌ పట్టణంలోని పా త బోధన్‌, శక్కర్‌నగర్‌, పోస్టాఫీసు, రాకాసీపేట్‌లలో మట్కారాయుళ్లుగా ముద్రపడ్డ వ్యక్తులు ఏళ్ల తరబడి మట్కా దందా నిర్వహిస్తున్నారు. మట్కా చిట్టీలను రాస్తూ ప్రతిరో జూ మట్కా దందాను యథేచ్ఛగా సాగిస్తు న్నారు. 


జోరుగా సాగుతున్న మట్కా దందా..

బోధన్‌ డివిజన్‌ పరిధిలో మట్కాదందా గత కొద్దిరోజులుగా మళ్లీ పుంజుకుంది. గతం లో బోధన్‌, రెంజల్‌, కోటగిరి, నవీపేట మండ లాల్లో మట్కాదందా విచ్చలవిడిగా సాగగా పోలీసులు ఉక్కుపాదం మోపారు. మట్కా నిర్వాహకులతోపాటు మట్కాఆడే వ్యక్తులను గుర్తించి వారిపై కేసు లు నమోదు చేయడంతోపాటు బైండోవర్‌లు చేయడంతో మట్కా దందా డీలా పడింది. తాజాగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో గత ఆరు నెలలుగా మళ్లీ మట్కా దందా పుంజుకుంది. మట్కాను ప్రధాన వ్యాపారంగా ఎంచుకున్న వ్యక్తులు మట్కా రాయుళ్ల బలహీనతను ఆసరా చేసుకొని తిరిగి మట్కా దందాకు ఊపిరి పోస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదనే ధ్యేయంగా మ ట్కారాయుళ్లు అటువైపునకు అడుగులు వేస్తున్నారు.


మట్కాకు బానిసల ుగా మారి నిత్యం రూ.వేలాదిగా మట్కాలో కోల్పోతున్నారు. సరిహద్దు ప్రాంతా లు మట్కాకు ప్రధాన అడ్డాలుగా మారాయి. మహారాష్ట్రలో మట్కా ఓపెన్‌ దందా కావడం తో అక్కడి నుంచి దారులు పడ్డాయి. తాజాగా పోలీసులు మట్కా దందాపై మళ్లీ గురిపెట్టారు. వారం రోజుల వ్యవధిలో బోధన్‌లో పోలీసులు రెండు మట్కా అడ్డాల పై దాడులు నిర్వహించి మట్కారా యుళ్లను అరెస్టు చేయడంతో పాటు చిట్టీలను, చార్ట్‌లను స్వా ధీనపర్చుకు న్నారు. బోధన్‌ డివి జన్‌లో మట్కా దందాపై పోలీసు లు దృష్టి పెట్టాల్సి ఉంది. ఉక్కు పాదం మోపాల్సి ఉంది.

Follow Us on:
Advertisement
Advertisement