రూ. 13 లక్షల కోట్లు పడిపోయిన కుటుంబాల ఆదాయం

ABN , First Publish Date - 2021-03-08T01:02:15+05:30 IST

కరోనా నేపధ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన కుటుంబాల ఆదాయం భారీగా పడిపోయిందని ఓ సర్వేలో వెల్లడైంది. కరోనా ప్రారంభం నుంచి దాదాపుగా రూ. 13 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోయారని ‘యుబిఎస్‌ సెక్యూరిటీస్‌ ఇండియా’ నివేదించింది. .

రూ. 13 లక్షల కోట్లు పడిపోయిన కుటుంబాల ఆదాయం

 న్యూఢిల్లీ : కరోనా నేపధ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన కుటుంబాల ఆదాయం భారీగా పడిపోయిందని ఓ సర్వేలో వెల్లడైంది. కరోనా ప్రారంభం నుంచి దాదాపుగా రూ. 13 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోయారని ‘యుబిఎస్‌ సెక్యూరిటీస్‌ ఇండియా’ నివేదించింది. . ఇదే పరిస్థితి 2021 మధ్యవరకు కొనసాగవచ్చని.. దీంతో వినిమయ డిమాండ్‌లో తగ్గుదల నమోదు కావచ్చని పేర్కొంది. ఆర్థికవ్యవస్థ గత కొద్ది నెలలుగారికవరీలో ఉన్నప్పటికీ... వినిమయంలో మాత్రం స్తబ్దత కొనసాగనుందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో, మూడో త్రైమాసికాల్లో వృద్ధి సానుకూలంగా నమోదు కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని యుబీఎస్‌ సెక్యూరిటీస్‌ ఇండియా నిపుణులు తాన్వీ గుప్తా జైన్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది మధ్య కాలం వరకూ ఆర్థిక వ్యవస్థ స్తబ్దతగానే ఉండొచ్చన్నారు. కరోనా కాలంలో ప్రజలు రూ. 13 లక్షల కోట్ల ఆదాయం కోల్పోవడంతో ఆ ప్రభావం రానున్న కొన్ని నెలల వరకు పడనుందన్నారు.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ ఏకంగా 24 శాతం మేర క్షీణించింది. ఆ తర్వాతి సెప్టెంబరు త్రైమాసికంలో 7.5 శాతం మేర పడిపోయింది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో మాత్రం స్వల్పంగా పెరిగింది. ‘కరోనాకు ముందు స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి. మార్చి త్రైమాసికంలో కూడా సానుకూల వృద్థి చోటు చేసుకోనుంది. అయితే వృద్థి రేటు ఏ స్థాయిలో కొనసాగుతుందో లేదో వేచి చూడాలి’ అని పేర్కొంది. దేశంలో గృహ రుణాలపై తగ్గిన వడ్డీ రేట్లు రియాల్టీ రంగానికి మద్దతును ఇవ్వొచ్చని తెలిపింది. నిరుడు గృహ అమ్మకాల్లో 31 శాతం తగ్గుదల చోటు చేసుకున్న విషయాన్ని ఈ నినవేదిక గుర్తు చేసింది.

Updated Date - 2021-03-08T01:02:15+05:30 IST