కుక్క‌ని పేరుపెట్టి పిల‌వ‌లేద‌ని ఎదురింటోళ్ల‌ని కుమ్మేశారు!

May 11 2021 @ 08:52AM

గురుగ్రామ్‌: పెంపుడు జంతువుల‌ను వాటి  య‌జ‌మానులు ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఎవ‌రైనా వాటిని మంద‌లిస్తే వారిపై కోప్ప‌డుతుంటారు. దీనికి మించిన ఘ‌ట‌న హ‌రియాణాలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే గురుగ్రామ్‌లోని సైబర్‌సిటీలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.... మీ కుక్క రోడ్ల‌పై తిరుగుతూ అంద‌రినీ భ‌య‌ప‌పెడుతోంది. 

దానిని వెంట‌నే మీ ఇంట్లో క‌ట్టేసుకోండని దాని య‌జ‌మానికి సుధీర్ అనే వ్య‌క్తి చెప్పాడు. మా కుక్క‌ను పేరు పెట్టి పిల‌వ‌కుండా... కుక్క అని అంటావా అంటూ దాని య‌జ‌మాని సుధీర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. అంత‌టితో ఆగ‌కుండా ఆ కుక్క య‌జ‌మాని కుటుంబ‌స‌భ్యులంతా క‌ల‌సి పొరుగుంట్లో ఉంటున్న సుధీర్ కుటుంబ స‌భ్యుల‌పై క‌ర్ర‌ల‌తో దాడి చేసి, వారిని తీవ్రంగా గాయ‌ప‌రిచారు. ఈ దాడిలో సుధీర్ ఇంటిలోని ఆరుగురు గాయాల‌పాల‌య్యారు. ఈ సంద‌ర్భంగా సుధీర్ మీడియాతో మాట్లాడుతూ  ఆ కుక్క త‌మ పిల్ల‌ల‌ను వెంబ‌డిస్తూ, క‌రిచేందుకు ప్ర‌య‌త్నించిందని, దానిని చూసిన తాను వారితో... కుక్క‌ను ఇంటిలో క‌ట్టుకోవాల‌ని చెప్పాన‌న్నారు.  ఇంత‌లోనే వారు దాడికి దిగార‌ని సుధీర్ తెలిపారు. ఈ ఉదంతంపై సుధీర్ గురుగ్రామ్‌లోని పోలీస్ స్టేషన్‌లో తన పొరుగింటివారిపై ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.


Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...