101 ఏళ్ల వృద్ధుడు కన్నుమూస్తే.. డీజే పెట్టి అంతిమయాత్ర చేసిన కుటుంబం!

Published: Wed, 30 Mar 2022 03:50:06 ISTfb-iconwhatsapp-icontwitter-icon
101 ఏళ్ల వృద్ధుడు కన్నుమూస్తే.. డీజే పెట్టి అంతిమయాత్ర చేసిన కుటుంబం!

ఎవరి కుటుంబంలో అయినా ఎవరైనా ప్రమాద వశాత్తూ చనిపోతే ఆ ఇల్లంతా శోకసంద్రంలో మునిగిపోతుంది. అయితే ఒక్కోసారి కుటుంబంలోని వృద్ధులు మరణిస్తే అంతగా ఎవరూ బాధపడకపోవచ్చు. కానీ సంబరాలు చేసుకుంటారా? రాజస్థాన్‌లోని కరోలీ జిల్లాలో అదే జరిగింది. 


ఇక్కడి కరణ్‌పూర్‌లో అందరి కన్నా వృద్ధుడైన దేవలాల్ అనే వ్యక్తి ఇటీవల మరణించాడు. ఆయన వయసు ఏకంగా 101. పెద్ద కుమార్తె వయసే 80 ఏళ్లు దాటిందంటే ఆయన ఎంత వృద్ధుడో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఆయన మరణించడంతో శవయాత్ర చేస్తూ.. స్మశానానికి తీసుకెళ్లారు దేవాలాల్ మృతదేహాన్ని. ఈ సమయంలో డీజే మ్యూజిక్ పెట్టి, బాణాసంచా పేలుస్లూ, కుటుంబ సభ్యులు స్థానికులు డ్యాన్సులు చేస్తూ పెద్ద పండగలా ఆయన్ను సాగనంపారు. 


ఈ వింత శవయాత్రను చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. సంతోషంగా ఒక పండగలా దేవాలాల్ రాఠోర్ మృతదేహాన్ని స్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన పెద్ద కుమారుడు రామ్‌జీలాల్ తండ్రికి తలకొరివి పెట్టాడు. వయసు మళ్లిన వాళ్లకు కుటుంబ సభ్యులు సేవలు చేయాల్సి ఉంటుందని, కానీ తన తండ్రి ఎప్పుడూ ఎవరి సాయం అడగలేదని, తన పనులు తానే చేసుకునేవాడని రామ్‌జీలాల్ చెప్పాడు. దేవాలాల్‌కు ఆరుగురు కూతుళ్లు, ముగ్గురు కుమారులు ఉన్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.