Sad: అయ్యో పాపం.. ఎంత పని జరిగింది.. ఈ యువతి మన మధ్య లేదు.. ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-05-31T03:44:58+05:30 IST

కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 21 ఏళ్ల యువతి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఆ యువతి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని..

Sad: అయ్యో పాపం.. ఎంత పని జరిగింది.. ఈ యువతి మన మధ్య లేదు.. ఏమైందంటే..

బెంగళూరు: కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 21 ఏళ్ల యువతి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఆ యువతి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆ ఆసుపత్రిపై, ఇద్దరు వైద్యులపై బాధిత కుటుంబం కేసు నమోదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన తేజస్విని అనే 20 ఏళ్ల యువతి ఆదివారం సాయంత్రం ఓ ఘటనలో తీవ్రంగా గాయపడింది. మారతహళ్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఆమెను చేర్పించారు. ఘటనలో ఆమె చేతికి తీవ్ర గాయమైందని, ఆపరేషన్ చేయాలని వైద్యులు తేజస్విని కుటుంబానికి చెప్పారు. ఆపరేషన్‌కు వైద్యులు సిద్ధమయ్యారు. ఈలోపు తేజస్వినికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. చేతికి ఆపరేషన్ చేశారు. డోసేజ్ ఎక్కువైందో లేక కారణం ఏంటో తెలియదు గానీ ఆపరేషన్ జరిగిన కొన్ని గంటలకే తేజస్విని ప్రాణాలు కోల్పోయింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆమె చనిపోయినట్లు వైద్యులు తేజస్విని కుటుంబానికి చెప్పారు. కూతురు చనిపోయిన విషయం తెలిసి తేజస్విని కుటుంబం తల్లడిల్లిపోయింది.



వైద్యం కోసం వస్తే ప్రాణాలు తీశారని, తమ కూతురిని పొట్టనపెట్టుకున్నారని బాధిత కుటుంబం ఆసుపత్రిపై ఆరోపణలు చేసింది. సదరు ఆసుపత్రిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ ఆసుపత్రిలో Anesthesia Specialistలుగా పనిచేస్తున్న Dr Shahshank, Dr Ashok Shettyలపై కేసు నమోదైంది. వైద్యుల నిర్లక్ష్యమే 21 ఏళ్ల తమ కూతురిని పొట్టనపెట్టుకుందని తేజస్విని కుటుంబం ప్రధానంగా ఆరోపిస్తోంది. తేజస్విని మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది. ఆమె మృతికి స్పష్టమైన కారణం పోస్ట్‌మార్టం రిపోర్ట్‌తో తేలుతుందని, తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-05-31T03:44:58+05:30 IST