తల్లిదండ్రులకు తెలియకుండా ఓ బిడ్డకు తల్లయిన యువతి.. ఆమె చేసిన ఒక్క పనితో పక్కింట్లో ఐదుగురు బలవన్మరణం.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2021-11-11T03:21:57+05:30 IST

కర్ణాటకలో జరిగిన ఓ ఘటనలో ఇలాగే.. చిన్న అబద్ధం కారణంగా ఓ కుటుంబంలో ఐదుగురు బలవర్మణానికి పాల్పడ్డారు. ఈ విషాధ సంఘటన వివరాల్లోకి వెళితే..

తల్లిదండ్రులకు తెలియకుండా ఓ బిడ్డకు తల్లయిన యువతి.. ఆమె చేసిన ఒక్క పనితో పక్కింట్లో ఐదుగురు బలవన్మరణం.. అసలు కథేంటంటే..
ప్రతీకాత్మక చిత్రం

ప్రాణం మీదికి వచ్చినప్పుడే అబద్ధాలు ఆడాలంటారు పెద్దలు. కానీ కొందరు చీటికీమాటికీ అబద్ధాలు ఆడుతూ కాలం గడుపుతుంటారు. మరికొందరైతే అత్యాశ కారణంగా అబద్ధాలు అడుతుంటారు. అయితే ఒక్కోసారి చిన్న అబద్ధమే.. చివరకు ప్రాణసంకటమవుతుందనే విషయం తర్వాత తెలుసుకుంటారు. కర్ణాటకలో జరిగిన ఓ ఘటనలో ఇలాగే.. చిన్న అబద్ధం కారణంగా ఓ కుటుంబంలో ఐదుగురు బలవర్మణానికి పాల్పడ్డారు. ఈ విషాధ సంఘటన వివరాల్లోకి వెళితే..


కర్ణాటకలోని కోలార్ పట్టణ పరిధిలోని గ్రామంలో ఓ గ్రామానికి చెందిన 20 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని, కోలార్ పట్టణానికి చెందిన ఓ యువకుడు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. తల్లిదండ్రులకు తెలీకుండా కోలార్‌లో ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. తల్లిదండ్రులకు చెబితే ఏమవుతుందో అని దాచిపెట్టింది. ఈ క్రమంలో వారి తల్లిదండ్రులు ఇంటికి రమ్మని పిలిచినా వెళ్లలేదు. తర్వాత ఆడపిల్లకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న యువతి తల్లి.. కూతురు వద్దకు వచ్చింది. కొన్నాళ్లు ఉన్న తర్వాత ఇంటికి వెళ్లేందుకు కుమార్తెను ఒప్పించింది. అయితే తమ పాపను సమీపంలో ఉంటున్న పుష్ప అనే మహిళ వద్ద ఉంచి, తల్లీకూతుళ్లు వారి సొంతూరికి వెళ్లారు. అక్టోబర్ 31న తిరిగి కోలార్‌కు వెళ్లి పాపను ఇవ్వాలని పుష్పను అడిగారు. అయితే ఒక్కసారిగా ఆమె రివర్స్ అయింది. తనకు ఏ పాపనూ ఇవ్వలేదంటూ బుకాయించడంతో అంతా షాక్ అయ్యారు.


తన పాపను తనకు ఇప్పించాలని బాధిత యువతి.. పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితురాలు పుష్పను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. అప్పటికీ ఆమె అంగీకరించలేదు. దీంతో పుష్ప కుటుంబసభ్యులను పిలిపించారు. అలాగే సీసీ పుటేజీని పరిశీలించగా.. పాపను ఇచ్చినట్లుగా బయటపడింది. నిజం బయటపడేసరికి మాట మార్చింది. అయితే తమ పరువు పోయిందనే కారణంతో పుష్ప కుటుంబసభ్యులు అక్కడే పురుగుల మందు తాగారు.  పరిస్థితి విషమించి..  మునియప్ప (75), నారాయణమ్మ (70), బాబు (45), గంగోత్రి (17) వెంటనే మృతి చెందారు. పుష్ప (33) చికిత్స పొందుతూ మృతి చెందింది. ఒక్క అబద్ధం కారణంగా కుటుంబం మొత్తం మృతి చెందడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోయారు. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2021-11-11T03:21:57+05:30 IST