Kuwait: ఇకపై ఫ్యామిలీ లేదా డిపెండెంట్ వీసా అంత ఈజీ కాదు.. శాలరీ పరిమితిని భారీగా పెంచేసిన కువైత్!

ABN , First Publish Date - 2022-09-18T15:02:06+05:30 IST

దేశంలో ప్రవాసుల (Expats) ప్రాబల్యాన్ని తగ్గించి స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచాలనే లక్ష్యంగా కువైత్ సర్కార్ (Kuwait Govt) గత కొంతకాలంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. వలసదారులకు ఎక్కడలేని షరతులు విధిస్తూ ముప్పుతిప్పలు పెడుతోంది. గడిచిన కొన్ని రోజులుగా ప్రవాసులకు ఇచ్చే అన్ని రకాల వీసాలపై కొత్త నిబంధనలు అమలు చేస్తోంది.

Kuwait: ఇకపై ఫ్యామిలీ లేదా డిపెండెంట్ వీసా అంత ఈజీ కాదు.. శాలరీ పరిమితిని భారీగా పెంచేసిన కువైత్!

కువైత్ వీసా: దేశంలో ప్రవాసుల (Expats) ప్రాబల్యాన్ని తగ్గించి స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచాలనే లక్ష్యంగా కువైత్ సర్కార్ (Kuwait Govt) గత కొంతకాలంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. వలసదారులకు ఎక్కడలేని షరతులు విధిస్తూ ముప్పుతిప్పలు పెడుతోంది. గడిచిన కొన్ని రోజులుగా ప్రవాసులకు ఇచ్చే అన్ని రకాల వీసాలపై కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. ఇదే కోవలో తాజాగా ఫ్యామిలీ/డిపెండెంట్ వీసాల (Family/Dependent visa) విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ఫ్యామిలీ వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన కువైత్.. తాజాగా వీటికి సంబంధించిన శాలరీ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 


ఆర్టికల్-22 ప్రకారం ఫ్యామిలీ/డిపెండెంట్ వీసాలు కలిగిన ప్రవాసులకు ఇప్పటివరకు శాలరీ పరిమితి(క్యాప్) 500 కువైటీ దినార్లు (రూ. 1.28లక్షలు)గా ఉండేది. ఇప్పుడు దీన్ని 800కేడీ (రూ.2లక్షలు)లకు పెంచింది. ఈ నిర్ణయం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని ప్రవాసులు ఎవరైతే ఆర్టికల్-17,18 కింద వీసా కలిగి ఉన్నారో వారందరికీ వర్తిస్తుందని అంతర్గత మంత్రిత్వశాఖ (Ministry of Interior) స్పష్టం చేసింది. 


ఇకపై ప్రవాసులు డిపెండెంట్/ఫ్యామిలీ వీసా పొందేందుకు 800కేడీ జీతానికి సంబంధించిన ఒరిజినల్ వర్క్ పర్మిట్ (Work permit) లేదా దాని తాలూకు ఏదైనా రుజువును సమర్పించాలని మంత్రిత్వశాఖ వెల్లడించింది. అంతేగాక అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్న పత్రాలు లేదా రుజువు పరిగణలోకి తీసుకోవడం జరగదని తెలిపింది. ఆర్టికల్-22పై ఇటీవల కువైట్‌లోకి ప్రవేశించిన ప్రవాసుల 16 ఏళ్లలోపు పిల్లలకు, భార్యలకు అందరికీ ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది.

Updated Date - 2022-09-18T15:02:06+05:30 IST