కుటుంబ పాలన అంతం కావాలి

ABN , First Publish Date - 2022-10-08T06:17:32+05:30 IST

రాష్ట్రంలో కుటుంబ పాలన అంతమై, బహుజనులు అధికారంలోకి రావాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

కుటుంబ పాలన అంతం కావాలి
స్థానికులతో మాట్లాడుతున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూదొందే : ఆర్‌ఎస్‌పీ

నాంపల్లి, అక్టోబరు 7: రాష్ట్రంలో కుటుంబ పాలన అంతమై, బహుజనులు అధికారంలోకి రావాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో శుక్రవారం పర్యటించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కుటుంబపాలన కొనసాగుతోందని,  దానిని అంతం చేసే దిశగా బహుజనులు కృషి చేయాలన్నారు. బస్సు టికెట్లు, నిత్యావస ర సరుకుల ధరలను అధికంగా పెంచ పేద  ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. నిరుద్యోగు  ల తెలంగాణగా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మునుగోడు ఉప ఎన్నిక ద్వారా గుణపాఠం చెప్పాలన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రతీసారి మాయమాటలతో కాలం వెల్లబుచ్చుతున్నారన్నారు. రైతులకు రుణమాఫీ చేయకుండా ఎనిమిదేళ్లు అప్పుల పాలుచేశారని దుయ్యబట్టారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూదొందేనన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పూదరి సైదులు, నర్సింహా, నాగేంద్ర, వినోద్‌, వెంకటయ్య, లక్ష్మీ, శ్రవణ్‌ తదితరులు ఉన్నారు.  

Updated Date - 2022-10-08T06:17:32+05:30 IST