పెళ్లయిన 12రోజులకే.. ప్రముఖ నటి సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2020-02-02T23:09:43+05:30 IST

ఇటీవలే ప్రముఖ సినీ నిర్మాతను వివాహమాడిన ఓ హీరోయిన్.. సంచలన నిర్ణయం తీసుకుంది. పెళ్లయిన 12రోజులకే అతనితో విడిపోవాలని డిసైడయిపోయింది.

పెళ్లయిన 12రోజులకే.. ప్రముఖ నటి సంచలన నిర్ణయం

ఇటీవలే ప్రముఖ సినీ నిర్మాతను వివాహమాడిన ఓ హీరోయిన్.. సంచలన నిర్ణయం తీసుకుంది. పెళ్లయిన 12రోజులకే అతనితో విడిపోవాలని డిసైడయిపోయింది. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హాలీవుడ్ నటి పమేలా ఆండర్సన్ ఇటీవలే జాన్ పీటర్స్ అనే నిర్మాతను వివాహమాడింది. 52ఏళ్ల పమేలా, 74ఏళ్ల జాన్ పెళ్లి హాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమె అభిమానులు మాత్రం ఈ విషయాన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. ఏ వయసులోనైనా ఓ తోడు కావాలనుకోవడంలో తప్పేముంది? అంటూ తమ అభిమాన నటిని సమర్థించుకున్నారు. అయితే వీరందరికీ షాకిస్తూ పమేలా ఓ మాట చెప్పారు. ‘మా జీవితాల్లో ఏది ముఖ్యం. ఒకరి నుంచి ఒకరం ఏం కావాలనుకుంటున్నాం? అనే విషయాలపై స్పష్టత కోసం కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం’ అని ఆమె వెల్లడించారు. ఇదే సమయంలో ఈ జంట వివాహ సర్టిఫికెట్ కోసం కూడా ఇంకా దరఖాస్తు చేయలేదనే విషయం కూడా బయటపడింది. దీంతో ఇక వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారంటూ హాలీవుడ్ జనాలు గుసగుసలాడుతున్నారు.

Updated Date - 2020-02-02T23:09:43+05:30 IST