బాలయ్య నన్ను టచ్ చేసినందుకు గర్వంగా ఉంది: అభిమాని

ABN , First Publish Date - 2021-03-06T21:46:19+05:30 IST

ఈ ఘటనపై బాలయ్య చేతిలో దెబ్బలు తిన్న యువకుడు స్పందించాడు. బాలయ్య బాబు తనను టచ్ చేసినందుకు గర్వంగా ఉందంటూ

బాలయ్య నన్ను టచ్ చేసినందుకు గర్వంగా ఉంది: అభిమాని

హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ యువకుడిపై చేయి చేసుకున్నారన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనపై బాలయ్య చేతిలో దెబ్బలు తిన్న యువకుడు స్పందించాడు. బాలయ్య బాబు తనను టచ్ చేసినందుకు గర్వంగా ఉందంటూ ఆ యువకుడు ఓ వీడియో విడుదల చేశాడు.


ఆ వీడియోలో ఏముందంటే..

‘‘నా పేరు సోము. నేను బాలయ్య బాబుగారి వీరాభిమానిని. బాలయ్య బాబు గారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా శ్రమిస్తున్నారు. ప్రచారంలో భాగంగా బాలకృష్ణ మా అన్నయ్య ఇంటికి వచ్చారు. నేను ఎవరో తెలియక బయట వ్యక్తి అనుకుని నన్ను పక్కకు తోశారు. అయినా ఇలాంటి వాటిని మాలాంటి ఎన్బీకే ఫ్యాన్స్ పట్టించుకోము. ప్రత్యర్థులు దీన్ని రాజకీయ కోణంలో చూస్తే వాళ్లంతటి మూర్ఖులు ఇంకెవరూ ఉండరు. ఇంకో విషయం ఏంటంటే.. ఈ రోజు ప్రచారంలో బాలయ్య బాబు గారు ఎవరికి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అలాంటిది ఈ రోజు నన్ను ఆయన టచ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బాలయ్య బాబుగారు నన్ను టచ్ చేశారని నేను గర్వంగా చెప్పుకుంటున్నా. జై బాలయ్య. జై తెలుగుదేశం’’ అంటూ ఆ వీడియోలో యువకుడు వెల్లడించాడు.



Updated Date - 2021-03-06T21:46:19+05:30 IST