ట్రైలర్‌లో ఉందిగానీ... సినిమాలో లేదు... కోర్టులో కేసు వేసిన Heroine అభిమానులు!

Published: Sun, 23 Jan 2022 21:21:52 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ట్రైలర్‌లో ఉందిగానీ... సినిమాలో లేదు... కోర్టులో కేసు వేసిన Heroine అభిమానులు!

ఎవరితో అయినా పెట్టుకోవచ్చు... డై హార్డ్ ఫ్యాన్స్‌తో వ్యవహారం అంటే మాత్రం... రిస్కే! హాలీవుడ్ ఫేమస్ ప్రొడక్షన్ హౌజ్ ‘యూనివర్సల్ స్టూడియోస్’కి తాజాగా అదే విషయం అవగాహనకొస్తోంది. ఇంతకీ, మ్యాటర్ ఏంటంటే... హాలీవుడ్ గార్జియస్ బ్యూటీ యానా డీ అర్మాస్ ఫ్యాన్స్ ఇద్దరికి బాగా కోపం వచ్చింది. వెంటనే మరో ఆలోచన లేకుండా యూనివర్సల్ స్టూడియోస్ నిర్మాణ సంస్థపై కోర్టులో కేసు వేశారు. కాకపోతే, యూనివర్సల్ చేసిన తప్పేంటంటే... 


‘యెస్టర్‌డే’ అనే సినిమా ట్రైలర్ కొన్నాళ్ల కింద విడుదలైంది. అందులో యానా డీ అర్మాస్ కనువిందు చేసింది. ట్రైలర్‌లో ఆమె ఉండటంతో చాలా మందిలో ‘యెస్టర్‌డే’ సినిమా పట్ల మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, తీరా సినిమా విడుదలయ్యాక బ్యూటీఫుల్ లేడీ ఎక్కడా కనిపించలేదు. మరి ఆమె డై హార్డ్ ఫ్యాన్స్‌కి ఆగ్రహం కట్టలు తెంచుకోకుండా ఉంటుందా చెప్పండి? అదే జరిగింది... 


యానా డీ అర్మాస్ వీరాభిమానులు ఇద్దరు అమేజాన్ ప్రైమ్‌లో 3.99 డాలర్లు... అంటే, దాదాపు 300 రూపాయలు వెచ్చించి ‘యెస్టర్‌డే’ సినిమా రెంట్‌ బేసిస్‌లో చూశారట. కానీ, తమ కష్టార్జితంతో ఓపిగ్గా సినిమా మొత్తం చూసినా ఎక్కడా యానా కనిపించలేదు. అప్పుడుగానీ, ‘యెస్టర్‌డే’ సినిమా నిర్మించిన యూనివర్సల్ సంస్థ తమని మోసం చేసిందని వారికి అర్థం కాలేదు. అందుకే, తమ అభిమాన నాయిక ‘‘ఫేమ్, రేడియెన్స్ అండ్ బ్రిలియన్స్’’ని ట్రైలర్‌లో తప్పుగా వాడుకుని సినిమాకి అక్రమంగా ప్రచారం పొందారని వారు కోర్టు మెట్లెక్కారు! చూడాలి మరి, అమ్మడి అభిమానుల ఆగ్రహానికి అమెరికన్ కోర్టులు ఏ విధంగా స్పందిస్తాయో... ట్రైలర్‌లో కనిపించి సినిమాలో మాయమైన అందగత్తె వెనుక ఉన్న అసలు కథేంటో... విచారణలో తేలాల్సిందే!

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

OtherwoodsLatest News in Teluguమరిన్ని...