మహానాడుకు అభిమానులు

ABN , First Publish Date - 2022-05-29T07:24:51+05:30 IST

నియోజకవర్గం నుంచి ఒంగోలులో జరిగిన మహానా డుకు ఐదు మండలాలనుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.

మహానాడుకు  అభిమానులు
దేవరాజుగట్టు వద్ద నుంచి వెళుతున్న టీడీపీ శ్రేణులు

భారీగా తరలిన టీడీపీ నాయకులు

ముందుగా గ్రామాల్లో ఎన్‌టీఆర్‌ విగ్రహాలకు నివాళి

ఎర్రగొండపాలెం,  మే 28 : నియోజకవర్గం నుంచి ఒంగోలులో జరిగిన మహానా డుకు ఐదు మండలాలనుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో ముందుగా ఎన్‌టీ ఆర్‌ విగ్రహానికి పూలమాలు  వేసి నివాళ్లు అర్పించారు.   అనంతరం ఎన్టీఆర్‌ సెంటరులో మహానాడుకు వెళ్లే వాహానాలకు డాక్టరు మన్నె రవీంద్ర టీడీపీ జెండా ఊపీ  ప్రారంభించారు. నియోజక వర్గం నుంచి ఇంచుమించు 7,500 మంది 250 వాహనాల్లో  మహానాడుకు తరలివెళ్లారు. 

 ఎర్రగొండపాలెం మండల టీడీపీ అధ్యక్షులు చేకూరి సుబ్బారావు, పుల్లలచెరువు మండల టీడీపీ అధ్యక్షులు పయ్యావుల ప్రసాదరావు, దోర్నాల మండల టీడీపీ అధ్యక్షులు యేర్వ మల్లికార్జునరెడ్డి,  పెద్దారవీడు మండల టీడీపీ అధ్యక్షులు మెట్టు శ్రీనివాసరెడ్డి, త్రిపురాంతకం మండల టీడీపీ అధ్యక్షులు మేకల వలరాజులు కార్యకర్తలను చైతన్యం చేసి మహానాడుకు తరలివెళ్లారు.

కంభం : ఒంగోలులో ఏర్పాటు చేసిన మహానాడు కార్యక్రమంలో భాగంగా శనివారం రెండవ రోజు జరిగే బహిరంగ సభకు కంభం, అర్థవీడు మండలాల నుంచి భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు బయలుదేరి వెళ్లారు. కంభం మండలం నుంచి 30 వాహనాలలో, అర్థవీడు మండలం నుంచి 15 వాహనాల్లో ఒంగోలుకు బయలుదేరి వెళ్లారు. 

తర్లుపాడు : ఒంగోలులో జరిగిన మహానాడు కార్యాక్రమానికి టీడీపీ నాయకులు భారీగా తరలివెళ్లారు. ముందుగా తర్లుపాడు పురవీధుల్లో డప్పు వాయిద్యాలతో ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్‌ సెంటర్‌లో నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిం చారు. టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ ఉపాధ్యక్షులు కె.కాశయ్య, టీడీపీ మండల అధ్యక్షులు ఉడుముల చిన్నపురెడ్డి ఆధ్వర్యంలో 50 కార్లలో తెలుగు తమ్ముళ్లు ఒంగోలు తరలివెళ్లారు.

పొదిలి : మహానాడు బహిరంగ సభకు శనివారం పొదిలి నుంచి నాయకులు, కార్యకర్తలు అభిమాను లు పెద్దఎత్తున తరలివెళ్లారు. పొదిలి పట్టణంతో పాటు పలు గ్రామాల నుంచి ప్రత్యేక  వాహనాలలో వెళ్ళారు. తరలివెళ్లిన వారిలో ప్రముఖ పారిశ్రామిక వేత్త యర్రమోతు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్‌, రాష్ట్ర ఫుడ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ డాక్లర్‌ స్వర్ణగీత, మండల, పట్టణ అధ్యక్షులు మీగడ ఓబుల్‌రెడ్డి, ముల్లా ఖుద్దూస్‌, రాష్ట్ర నాయకులు అనీల్‌(పండు), ఆవులూరి యలమంద, జిల్లా నాయకులు సామంతపూడినాగేశ్వరరావు,డాక్టర్‌ ఇమాంసా, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కాటూరి పెద్దబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్లు యర్రమోతు శ్రీనివాసులు, చప్పిడి రామలింగయ్య,  నాయకులు రసూల్‌, గౌస్‌, యాసిన్‌, ఎస్‌ఎం.బాషా, కాటూరి చినబాబు, మునిశ్రీను, వై.వెంకటేశ్వరరెడ్డి, పొల్లా నరిసింహారావు, తదితరులు ఉన్నారు.

మహానాడుకు తరలిన తెలుగు తమ్ముళ్లు

మార్కాపురం : మార్కాపురం పట్టణం నుంచి సుమారు 80 వాహనాలలో 2000 మంది, మండలం నుంచి 65 వాహనాలలో 1500 మంది తరలివెళ్లారు. మార్కాపురం నుంచి  జడ్పీటీసీ మాజీ సభ్యుడు  కందుల రామిరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జున్‌, పట్టణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు షేక్‌ మౌలాలీ, కొప్పులశ్రీనివాసులు, మండల కమిటీ అధ్యక్షులు జవ్వాజి రామాంజనేయరెడ్డి, కౌన్సిలర్లు యేరువ వెంకట నారాయణరెడ్డి, నాలి కొండయ్య యాదవ్‌, తెలుగుయువత నాయకులు దొడ్డా రవికుమార్‌, తదితరులు తరలివెళ్లారు.

పెద్దారవీడు నుంచి...

ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పెద్దార వీడు మండలం నుంచి టీడీపీ మండల అధ్యక్షుడు మెట్టు శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో మహానాడు బహిరంగసభకు వాహనాలు ఏర్పాటు చేశారు. టీడీపీ మాజీ అధ్యక్షుడు గొట్టం శ్రీనివాసరెడ్డి, దొడ్డా భాస్కరరెడ్డి, సర్పంచ్‌ ఆకుమల్ల శ్రీనివాసరెడ్డి,  ఎంపీటీసీలు దండా వెంకటేశ్వరరెడ్డి, యేరువ నారాయణరెడ్డి, మాజీ జడ్పీటీసీలు గుమ్మా గంగ రాజు, జడ్డా రవి, మాజీ సర్పంచ్‌ చిలకా ఇజ్రాయేల్‌ తదితరులు మహానాడుకు తరలివెళ్లారు. 

పెద్దదోర్నాల :  ఒంగోలులో జరిగిన మహానాడుకు దోర్నాల మండల టీడీపీ నాయకులు శనివారం భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఏర్వ మల్లికార్జునరెడ్డి, మాజీ అధ్యక్షుడు అంబటి వీరారెడ్డి  ఆధ్వర్యంలో సుమారు  500 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు కార్యాలయంలోని ఎన్‌టీఆర్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మహానాడుకు తరలివెళ్లారు.  కార్యక్రమంలో దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, చంటి, దేసు నాగేంద్రబాబు, కే రాజేంద్ర, ఎలకపాటి చెంచయ్య, షేక్‌ సమ్మద్‌భాష, బట్టు సుధాకర్‌ రెడ్డి, రావిక్రింధి సుబ్బరత్నం, ఇస్మాయిల్‌, నాగెళ్ల సత్యనారాయణ, జడి లక్ష్మయ్య, కే శ్రీనివాస్‌ యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

పుల్లలచెరువు : టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మహానటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామరావు జయంతి సంధర్భంగా ఒంగోలులో నిర్వహించిన మహానాడుకు టీడీపీ శ్రేణులు, తెలుగు తమ్ముళ్లు పుల్లలచెరువు మండలం నుంచి భారీగా తరలివెళ్లారు. ముందుగా టీడీపీ మండలాధ్యక్షుడు పయ్యావుల ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఏన్టీఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్‌ కట్‌ చేసి పంపించారు.

గిద్దలూరు : ఒంగోలులో జరిగిన మహానాడు కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ముత్తుముల అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. శనివారం ఉదయం నుంచే గ్రామాల్లో టీడీపీ నాయకుల, కార్యకర్తల హడావిడి మొదలైంది. ప్రత్యేకంగా సమకూర్చుకున్న జీపులు, కార్లకు పార్టీ జెండాలు కట్టుకుని ఉత్సాహంగా మహానాడుకు తరలివెళ్లారు. గిద్దలూరు మున్సిపాలిటీతోపాటు గిద్దలూరు రూరల్‌ మండలం, రాచర్ల, కొమరోలు, బేస్తవారపేట, కంభం, అర్థవీడు మండలాల నుంచి టీడీపీ శ్రేణుల వాహనాలు బేస్తవారపేట జంక్షన్‌కు చేరుకుని అక్కడి నుండి పొదిలి సమీపంలో ఒక ప్రైవేటు కళాశాలలో ఏర్పాటు చేసిన భోజనాల వరకు వెళ్లారు. అక్కడ భోజనం చేసుకుని మాజీఎమ్మెల్యే అశోక్‌రెడ్డి వెంట రాగా సుమారు 300 వాహనాలలో 2500 మందికి పైగా ఒంగోలు తరలివెళ్లారు. కార్యక్రమంలో గిద్దలూరుటీడీపీ పట్టణ అధ్యక్షులు సయ్యద్‌ షాన్షావలి, నియోజకవర్గంలోని వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, కె.యోగానంద్‌, తోట శ్రీనివాసులు, సోరెడ్డి మోహన్‌రెడ్డి, బోనేని వెంకటేశ్వర్లు, టీడీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి షేక్‌ మస్తాన్‌వలి, పలువురు సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, అనుబంధ విభాగాల నాయకులు మహానాడుకు తరలివెళ్ళిన వారిలో ఉన్నారు.

Updated Date - 2022-05-29T07:24:51+05:30 IST