ఈసారి విజయ్‌ ఇచ్చే ట్రీట్‌ ఏమిటో..?

Jun 19 2021 @ 20:17PM

కోలీవుడ్‌ అగ్రహీరో ఇళయదళపతి విజయ్‌ ఈ నెల 22వ తేదీ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోనున్నారు. అయితే, ప్రతి ఏటా తన జన్మదినం సందర్భంగా అభిమానులకు ఒక శుభవార్త చెప్పడం విజయ్‌కు ఆనవాయితీ. ఈ క్రమంలో ఈ సారి ఎలాంటి శుభవార్త చెబుతారోనని ప్రతి ఒక్కరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తన కొత్త చిత్రం వివరాలు వెల్లడిస్తారని భావిస్తున్నారు. ప్రస్తుతం నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో ఒక చిత్రంలో విజయ్‌ నటిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. కరోనా రెండో దశ లాక్‌డౌన్‌కు ముందు ఈజిప్టులో తొలి షెడ్యూల్‌ షూటింగు పూర్తయింది. ఈ చిత్రానికి ‘టార్గెట్‌’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 


ఈ యేడాది సంక్రాంతికి ‘మాస్టర్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్‌.. ఇపుడు టార్గెట్‌గా వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే, టాలీవుడ్‌ దర్శకుడు వంశీ పైడిపల్లి - విజయ్‌ కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఓ చిత్రం తెరకెక్కించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.  మొత్తంమీద విజయ్‌ తన పుట్టినరోజునాడు ప్రస్తుతం నటిస్తున్న చిత్రం లేదా కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.