ఆ పాటలో Amitabh లేకపోవటానికి... ABHI, AISH కారణం అంటోన్న డైరెక్టర్...

Published: Mon, 17 Jan 2022 22:38:08 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆ పాటలో Amitabh లేకపోవటానికి... ABHI, AISH కారణం అంటోన్న డైరెక్టర్...

తాను రూపొందించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఓం శాంతి ఓం’లోని ‘దీవాన్గి దీవాన్గి’ పాటలో అమితాబ్ బచ్చన్, దేవా ఆనంద్ కూడా ఉండాలని డైరెక్టర్ ఫరా ఖాన్ భావించిందట. కానీ, సినిమాకే హైలైట్‌గా నిలిచిన ఆ మల్టీ స్టారర్ సాంగ్‌లో వారిద్దరూ భాగం కాలేకపోయారట. బిగ్ బి తమ సినిమాలో ఎందుకు కనిపించలేదో ప్రత్యేకంగా వివరిస్తూ... ఆమె అభిషేక్, ఐశ్వర్య రాయ్ పేర్లు కూడా ప్రస్తావించింది. సీనియర్ బచ్చన్ తన వ్యక్తిగత కారణాల వల్ల పాటలో కనిపించలేదని చెప్పింది ఫరా ఖాన్. మరికొంత వివరణ ఇస్తూ ఆమె ‘‘అదే నెలలో అభిషేక్, ఐశ్వర్య పెళ్లి జరగాల్సి ఉందని ఆయన మాకు చెప్పారు’’ అంది. 

ఆ పాటలో Amitabh లేకపోవటానికి... ABHI, AISH కారణం అంటోన్న డైరెక్టర్...

‘ఓం శాంతి ఓం’ సినిమా షారుఖ్ హీరోగా ఫరా ఖాన్ దర్శకత్వంలో రూపొందింది. హీరోయిన్‌గా దీపికా పదుకొణే నటించింది. ఆమెకు అదే తొలి బాలీవుడ్ చిత్రం కావటం విశేషం. అయితే, ‘దీవాన్గి దీవాన్గి’ అంటూ సాగే పార్టీ సాంగ్‌లో బీ-టౌన్ నటీనటులు చాలా మంది క్యామియో అప్పియరెన్స్‌లు ఇచ్చారు. వారిలో అమితాబ్ కనిపించకపోవటంపై ‘ద కపిల్ శర్మ షో’లో ఈ మధ్య ఫరా ఖాన్ వివరణ ఇచ్చారు. అభి, ఐష్ పెళ్లి పనుల వల్లే బాలీవుడ్ మల్టీ స్టారర్ సాంగ్‌లో బిగ్ బి కనిపించలేకపోయారట. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...