అందుబాటులో లేని వ్యవసాయ అధికారులు

ABN , First Publish Date - 2022-06-29T07:32:25+05:30 IST

మండల కేంద్రంలోని వ్యవసాయాధికారి కార్యాల యంలో అధికారులు అందుబాటులో ఉండడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అందుబాటులో లేని వ్యవసాయ అధికారులు
ఖానాపూర్‌ వ్యవసాయ అధికారి కార్యాలయం ఎదుట రైతుల నిరసన

ఖానాపూర్‌లో అన్నదాతల నిరసన

ఖానాపూర్‌, జూన్‌ 28 : మండల కేంద్రంలోని వ్యవసాయాధికారి కార్యాల యంలో అధికారులు అందుబాటులో ఉండడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం మండల వ్యవసాయాధికారి కార్యా లయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఉదయం 11:30 గంటల వరకు వ్యవ సాయాధికారి కార్యాలయంలో అధికారులు ఎవరు రాకపోవడం, కార్యాలయానికి తాళం వేసి ఉండడం పట్ల వారు మండిపడ్డారు. విత్తనాల కోసం వచ్చిన రైతులు ఉదయం 11:30 గంటల వరకు వేచి చూసినా అధికారులు రాకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. తాము విత్తనాల కోసం పీఏసీఎస్‌ విత్తన విక్రయకేంద్రం వద్దకు వెళ్తే అక్కడ అధికారులు వ్యవసాయ అధికారుల నుండి టోకెన్‌ తీసుకు రావాలని సూచిస్తున్నారని ఇక్కడ మాత్రం ఉదయం 11:30 దాటినా అధికారులు రావడం లేదని దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, అధి కారులు రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని పలు గ్రామాల నుండి విత్తనాల కోసం తరలివచ్చిన రైతులు కోరారు. ఈ విషయమై జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్‌ను వివరణ కోరగా విధుల పట్ల అలసత్వం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. బుధవారం నుండి ప్రతి రైతు వేదిక లో ఏఈవోలు అందుబాటులో ఉంటారని, రైతులు మండల వ్యవసాయ అధికారి కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి రైతువేదికలో ఏఈవోలు అందుబాటులో ఉండేలా తక్షణమే ఆదేశాలు జారీ చేస్తానన్నారు. 

Updated Date - 2022-06-29T07:32:25+05:30 IST