చదువు రాక.. ఫీజులు కట్టలేక!

ABN , First Publish Date - 2021-03-03T07:00:12+05:30 IST

ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు. కళాశాలలో ఫీజు కూడా కట్టలేని పరిస్థితి! మరోవైపు చదువు రాక ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్‌! దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

చదువు రాక.. ఫీజులు కట్టలేక!

ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య

ాలేజీలోనే పురుగు మందు తాగిన సుధాకర్‌

చికిత్స పొందుతూ మృతి

బేస్తవారపేట, మార్చి 2 : ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు. కళాశాలలో ఫీజు కూడా కట్టలేని పరిస్థితి! మరోవైపు చదువు రాక ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్‌! దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా అవుకు మండలం శింగనపల్లికి చెందిన మండలి కంబగిరి ఒక్కగానొక్క కుమారుడైన రామసుఽధాకర్‌ (20) మండలంలోని సలకలవీడు సమీపంలో ఉన్న ఒక ఫార్మసీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇప్పటి వరకూ 10 సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యాడు. తరచూ ఇదే విషయమై బాధపడుతుండే వాడు. ఈ నేపథ్యంలో నెల క్రితం స్వగ్రామం వెళ్లాడు. తరగతులు ప్రారంభమైనట్లు స్నేహితులు ఫోన్‌ చేసిన చెప్పడంతో సోమవారం కళాశాలకు వచ్చాడు.  అక్కడే పురుగు మందుతాగి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. బేస్తవారపేట పోలీసులు కర్నూలు వెళ్లి రామసుధాకర్‌ తండ్రి నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు. 


Updated Date - 2021-03-03T07:00:12+05:30 IST