ఆందోళనలో అన్నదాత

ABN , First Publish Date - 2021-05-07T05:35:33+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి, అకాల వర్షాలు రైతులను వణికిస్తున్నాయి. వరికోతలను ముగించి ధాన్యం అమ్మేందు కు సిద్ధమవుతున్న రైతులకు కంటిమీద కునుకురావడం లే దు.

ఆందోళనలో అన్నదాత
సిరికొండలో అకాల వర్షంతో కళ్లాల్లోనే తడిసిన ధాన్యం

జిల్లాలో ధాన్యం సేకరణపై అకాల వర్షం, కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌

వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతులు

పలువురు రైతులు, ఉద్యోగులు, కూలీలకు కరోనా పాజిటివ్‌

గత ఏడాదిలాగే ధాన్యం నుంచి భారీగా తరుగు తీస్తున్న మిల్లర్లు 

నిజామాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి, అకాల వర్షాలు రైతులను వణికిస్తున్నాయి. వరికోతలను ముగించి ధాన్యం అమ్మేందు కు సిద్ధమవుతున్న రైతులకు కంటిమీద కునుకురావడం లే దు. అకాల వర్షాలతో రైతులు ధాన్యం కాపాడుకునేందుకు ని త్యం నానా తిప్పలు పడుతున్నారు. జిల్లాలో కొవిడ్‌ వ్యాప్తి  ధాన్యం కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నా నిత్యం భా రీగానే కొనుగోళ్లు చేస్తున్నారు. జిల్లాలో కూలీలు, సహకార సంఘాల అధికారులు కరోనా బారిన పడుతున్నా లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కూలీల కొరత కారణంగా ధాన్యాన్ని తరలించేం దుకు ఇబ్బందులు పడుతున్నారు.

అకాల వర్షంతో తీవ్ర ఇబ్బందులు

జిల్లాలో గడిచిన వారం రోజులుగా అకాల వర్షాలు కురు స్తుండడంతో వరి పంట దెబ్బతింటోంది. ఆరబోసిన ధాన్యం తడిసిపోతోంది. దీంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఎన్నో తిప్పలు పడు తున్నారు. ఉదయం ఆరబోసి సాయ ంత్రం కుప్ప నూ రుస్తున్నారు. ప్ర తీరోజు జల్లులు పడడం, కొన్ని గ్రామాల పరిధి లో రాళ్లు పడు తుండడంతో ఆందోళన చెందు తున్నారు. కొనుగోలు చేసిన ధాన్యం సంచులు కూడా త్వరగా తరలించకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నా రు. టార్పాలిన్లు కప్పినా కొంత మేర ధాన్యం తడిస్తే మిల్లుకు వెళ్లిన తర్వాత తీసుకోకపోవడంతో సమస్యలు ఎదుర్కొంటు న్నారు. మిల్లుల వద్ద వాహనాలు ఆగిపోవడం రోజుల తరబ డి ధాన్యం ఖాళీ చేయకపోవడం వల్ల సమస్యలు వస్తున్నా యి. మిల్లర్లు అడిగినంత తరుగు ఇచ్చి వస్తున్నారు. కొనుగో లు చేసిన ధాన్యంను వెంటనే తరలించాలని రైతులు  కోరు తున్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా తీసుకోవాలని అధికారు లకు విన్నవిస్తున్నారు.

ధాన్యం కొనుగోళ్లపై కరోనా ప్రభావం

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. ధాన్యం అమ్మే రైతుల నుంచి సేకరణ చేపట్టిన అధి కారులు, తరలించే కూలీలు కరోనా బారిన పడుతున్నారు. ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద కరోనా నిబంధనలు పాటించి నా ఇబ్బందులు తప్పడం లేదు. కుప్ప నూర్చే సమయంలో, బస్తాలు నింపి వాహనాలు తరలించే సమయంలో కరోనా వ్యాపిస్తోంది. ధాన్యం సేకరణలో ఉన్న పౌరసరఫరాలు, వ్య వసాయ, సహకార, రెవెన్యూ శాఖలలో కొంతమంది ఉద్యో గులు, అధికారులు కరోనా బారిన పడ్డారు. వీరితో పాటు రై తులు, కూలీలు, ధాన్యం తరలించే కొంత మంది డ్రైవర్లకు కూడా కరోనా సోకింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ధాన్యం సేకరణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. నిత్యం టార్గెట్‌ తగ్గకుండా కొనుగోళ్లు చేస్తున్నారు. నెలాఖరులోపు కొనుగోళ్లు పూర్తి చేయాలని ప్రతీరోజు కొనుగోళ్లను పెంచుతున్నారు.

రైతులకు తప్పని తరుగు తిప్పలు

జిల్లాలో ధాన్యం సేకరణ జోరుగా సాగుతున్నా.. మిల్లర్లు తమ మాయాజాలంను విడువలేదు. మొదట అధికారుల నిఘాతో తరుగు తీయకున్నా ప్రస్తుతం ఆపడం లేదు. కొను గోలు కేంద్రాల వద్ద బస్తాకు కిలోన్నరకు పైగా తీస్తున్నారు. ధాన్యంను మిల్లులకు తరలించగానే తేమ ఎక్కువగా ఉంద ని, కడ్తా ఉందని చెబుతూ ధాన్యంను దించడం లేదు. రెం డు మూడు రోజులు దించకుండా ఆపడంతో రైతులు తప్ప నిసరి ఒప్పుకునేటట్లు చేస్తున్నారు. క్వింటాలుకు నాలుగు నుంచి ఐదు కిలోల వరకు తీస్తున్నారు. ధాన్యం నిబంధనల మేరకు ఉన్నా తరుగు తప్పడం లేదు. అధికారులు కొన్ని చో ట్ల ఆపినా ఎక్కువ మంది మిల్లర్లు మాత్రం ఆపడం లేదు. జిల్లాలో అకాల వర్షాలు ఉండడం, కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో తరుగుతో నష్టం వస్తున్నా రైతులు అమ్మకాలు చేస్తున్నారు. తమకు పరిస్థితులు కలిసి వస్తుండడంతో మిల్ల ర్లు తరుగు తీయడాన్ని కొనసాగిస్తున్నారు.

3,51, 814 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు 

జిల్లాలో నెల రోజులుగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నా రు. గత నెల మొదటివారంలో మొదలుపెట్టిన అధికారులు ప్రస్తుతం రోజుకు ఇరవై వేల మెట్రిక్‌ టన్నుల వరకు కొను గోలు చేస్తున్నారు. జిల్లాలో రైతులు ఈ యాసంగిలో 3.87 లక్షల ఎకరాలలో వరిని సాగు చేశారు. ఈ సీజన్‌లో 8 లక్ష ల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం దిగుబడి వస్తుందని అధి కారులు అంచనా వేశారు. సుమారు 7లక్షల మెట్రిక్‌ టన్ను లకు పైగా ధాన్యం సేకరణ చేయాలని నిర్ణయించారు. జిల్లా లో 420 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరిస్తున్నా రు. గడిచిన నెల రోజుల్లో 3 లక్షల 51 వేల 814 మెట్రిక్‌ ట న్నుల ధాన్యంను సేకరించారు. క్వింటాలు ఏ గ్రేడు ధాన్యాన్ని రూ.1,888లకు, కామన్‌ రకంను రూ.1,866లకు కొనుగో లు చేస్తున్నారు. యాసంగి కావడంతో ఎక్కవ ధాన్యం కామ న్‌ రకం కిందనే కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వర కు రూ.660 కోట్ల విలువైన ధాన్యంను సేకరించారు. జిల్లాలో 40 వేల 656 మంది రైతుల నుంచి 3 లక్షల 51 వేల 814  మెట్రిక్‌ టన్నుల ధాన్యంను సేకరించారు. ఇప్పటివరకు రెం డు లక్షల మెట్రిక్‌ టన్నులకుపైగా ట్యాబ్‌ ఎంట్రీ చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.320 కోట్లు రైతుల బ్యాంకు ఖా తాలలో జమచేశారు. ప్రతీరోజు ప్రాథమిక సహకార సం ఘాల వారీగా ఎంట్రీ చేస్తున్నారు. రైతుల వివరాలతో పౌర సరఫరాల సంస్థకు బిల్లులు రాగానే చెల్లింపులు చేస్తున్నారు. ప్రతీ రైతుకు త్వరగా డబ్బులు చెల్లించేవిధంగా ఏర్పాట్లు చే స్తున్నారు. రైతులు అమ్మిన రోజే వారి పట్టాదారు పాస్‌బుక్‌ నెంబర్‌, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు తీసుకొని ట్రక్‌సీట్‌ జనరేటు చేసి ట్యాబ్‌ ఎంట్రీ చేస్తున్నారు.

తడిసిన ధాన్యం కొనుగోలుకు కలెక్టర్‌ అనుమతి

జిల్లాలో తడిసిన ధాన్యం కొనుగోళ్లకు కలెక్టర్‌ నారాయణ రెడ్డి అనుమతి ఇచ్చారు. రైతులు ధాన్యం ఆరబోయగానే దా నిని కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆ ధాన్యం కొనుగోలు చేయగానే బాయిల్డ్‌ మిల్లులకు తరలి ంచాలని కోరారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

కరోనా ఉన్నా.. ధాన్యం సేకరణ ఆపలేదు..

- సింహచలం, జిల్లా సహకార అధికారి 

కరోనా ఉన్నా లక్ష్యానికి అనుగుణంగా ధాన్యాన్ని సేకరిస్తు న్నాం. కొనుగోళ్ల విధుల్లో ఉన్న కొంత మంది ఉద్యోగులకు క రోనా సోకింది. సొసైటీల్లో ఉన్న ఇతర ఉద్యోగులు, ఇతర శాఖల సమన్వయంతో ధాన్యం కొనుగోలు చేస్తున్నాం.

బిల్లులు వచ్చిన వెంటనే చెల్లింపులు

- అభిషేక్‌ సింగ్‌, డీఎం పౌరసరఫరాల సంస్థ 

ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత సొసైటీల నుంచి  బి ల్లులు రాగానే చెల్లింపులు చేస్తున్నాం. డబ్బులు రైతుల బ్యా ంకు ఖాతాలలో జమచేస్తున్నాం. గన్నీ బ్యాగులు, వాహనా లు, కూలీల కొరత లేకుండా చూస్తున్నాం.

తూకం ఆలస్యంగా చేస్తున్నారు..

- అన్వేష్‌రెడ్డి, కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు 

రాష్ట్రంలో అధికారులు ధాన్యం సేకరణ సక్రమంగా చేయ డం లేదు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, కళ్లాల వద్దనే ధాన్యం ఉం ది. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ధాన్యం కొనగానే వెంటనే తూకం వేయాలి. మిల్లులకు తరలించాలి. తరుగు లేకుండా కొనుగోలు చేయాలి.

Updated Date - 2021-05-07T05:35:33+05:30 IST