స్నేహితులు ఇచ్చిన ఒకే ఒక్క ఐడియా అతడి జీవితాన్ని మార్చేసింది.. కోటి రూపాయలు సంపాదించి చూపించిన రైతు..!

ABN , First Publish Date - 2022-08-19T17:53:46+05:30 IST

అతడికి పెళ్లై పిల్లలు పుట్టారు. పిల్లలు పెరిగి పెద్దవుతున్న క్రమంలోనే సోదరులు వేరు కాపురం పెట్టారు. ఉన్న పంట భూమిని తలా కొంత పంచుకోవాల్సి వచ్చింది. వాటాలో భాగంగా అతడికి వచ్చిన ఎకరం భూమిలో అందరిలా వ్యవసాయం చేయడం మొదలు

స్నేహితులు ఇచ్చిన ఒకే ఒక్క ఐడియా అతడి జీవితాన్ని మార్చేసింది.. కోటి రూపాయలు సంపాదించి చూపించిన రైతు..!

ఇంటర్నెట్ డెస్క్: అతడికి పెళ్లై పిల్లలు పుట్టారు. పిల్లలు పెరిగి పెద్దవుతున్న క్రమంలోనే సోదరులు వేరు కాపురం పెట్టారు. ఉన్న పంట భూమిని తలా కొంత పంచుకోవాల్సి వచ్చింది. వాటాలో భాగంగా అతడికి వచ్చిన ఎకరం భూమిలో అందరిలా వ్యవసాయం చేయడం మొదలు పెట్టారు. అయితే అతడికి నిరాశే ఎదురైంది. సరిగ్గా అప్పుడే అతడికి స్నేహితులు సలహా ఇచ్చారు. ఆ ఐడియా.. అతడి జీవితాన్నే మార్చేసింది. ప్రస్తుతం అతడు కోటీశ్వరుడయ్యాడు. ఈ రైతుకు సంబంధించిన విజయగాథపై ఓలుక్కేస్తే.. 


రాజస్థాన్‌(Rajasthan)లోని భరత్‌పూర్ ప్రాంతానికి చెందిన నిహాల్ సింగ్(Nihar singh) అనే వ్యక్తి అప్పుడు 30ఏళ్లలోపే. కుటుంబ సభ్యులు మాటలకు ఓకే చెప్పి.. వాళ్లు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అనంతరం పిల్లలకు జన్మనిచ్చాడు. ఇంతలో తన సోదరులు వేరు కాపురం పెట్టారు. ఉన్న భూమిని తలా కొంచెం పంచుకున్నారు. వాటాలో భాగంగా నిహాల్ సింగ్‌కు ఎకరం పొలం వచ్చింది. ఆ భూమిని నమ్ముకుని.. అందరిలా వ్యవసాయం ప్రారంభించాడు. అయితే.. అక్కడ అతడికి నిరాశే ఎదురైంది. లాభాలు రాకపోగా నష్టాలు ఎదురయ్యాయి. దీంతో పిల్లల భవిష్యత్తు తలచుకుని బాధ పడ్డాడు. సరిగ్గా అప్పుడే అతడికి తన స్నేహితులు ఓ ఐడియా ఇచ్చారు. ఫిష్ ఫార్మింగ్(Fish Farming) చేయాలని సూచించారు. 



అందులో అపారమైన లాభాలు ఉంటాయని చెప్పారు. దీంతో 35ఏళ్ల వయసులో అతడు ఫిష్ ఫార్మింగ్ మొదలు పెట్టాడు. స్థానికంగా ఉన్న గవర్నమెంట్ చెరువును లీజుకు తీసుకుని అందులో చేపలను పెంచాడు. మొట్టమొదటిసారి ఏకంగా రూ.6లక్షల లాభం పొందాడు. ఆ తర్వాత నిహాల్ సింగ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన చేపల చెరువులో పెంచిన చేపలను ఢిల్లీ, ఫరీదాబాద్‌లలోని మండీలకు ఎగుమతి చేస్తూ గత 20ఏళ్లుగా భారీ మొత్తంలో లాభాలు ఆర్జీస్తున్నాడు. ఇలా సంపాదించిన డబ్బుతో ముగ్గురు కూతుర్ల పెళ్లిళ్లు చేసిన అతడు.. ఇద్దరు కొడుకులను ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కొంత భూమిని కూడా కొనుగోలు చేశాడు. ప్రస్తుతం అతడి వద్ద సుమారు రెండు ఎకరాల భూమి ఉండగా.. దాని విలువ కోటి రూపాయలు. ఇప్పుడు తన చేపల చెరువలో దాదాపు 10లక్షల చేపలను ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దొంగల బెడద కారణంగా ఇద్దరు వ్యక్తులను వాటికి కాపలాగా పెట్టినట్టు వెల్లడించారు. ప్రస్తుతం స్థానిక రైతులకు నిహాల్ సింగ్ ఆదర్శంగా నిలిచారు.


Updated Date - 2022-08-19T17:53:46+05:30 IST