అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-27T07:14:49+05:30 IST

: అప్పుల బాధతో ఆత్మహత్యాయత్నం చేసిన రైతు చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

అప్పుల బాధతో  రైతు ఆత్మహత్య
సక్రు (ఫైల్‌ ఫొటో)

సూర్యాపేటరూరల్‌, అక్టోబరు 26: అప్పుల బాధతో ఆత్మహత్యాయత్నం చేసిన  రైతు చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. సూర్యాపేట రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌ ట్రైనీ ఎస్‌ఐ సోమేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట మండలం హనుమతండాకు చెందిన ధరావత్‌ సక్రు(57), మంగమ్మ దంపతులు తమకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. ఈ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లు చేశారు. కుమారుడు తండాలోనే తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాడు. సాగు కోసం చేసిన అప్పులతో పాటు ఇటీవల కుమార్తె  పెళ్లి కోసం కలిపి సుమారు రూ.5 లక్షల వరకు సక్రు అప్పులు చేశాడు. వ్యవసాయంతో అప్పు తీరే మార్గం కనిపించకపోవడంతో సూర్యాపేటకు దంపతులు వలస వెళ్లారు. అక్కడే ఉంటూ ఇద్దరూ రాగి జావ, గట్కా విక్రయిస్తూ జీవిస్తున్నారు.   ఈ క్రమంలో అప్పులకు వడ్డీలు కట్టలేక, వ్యాపారం నిర్వహించలేక కొద్ది రోజులగా కూలి పనులకు వెళుతున్నారడు. భార్య బయటకు వెళ్లిన సమయంలో సోమవారం ఇంట్లో  సక్రు పురుగు మందు తాగాడు. ఇంటికి వచ్చిన భార్య మంగమ్మ గమనించి గ్రామస్థుల సాయంతో భర్తను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించింది.  చికిత్స పొందుతూ సుక్రు మంగళవారం మృతి చెందాడు. భార్య మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైనీ ఎస్‌ఐ సోమేశ్వరి తెలిపారు.  



పెద్దగుట్టలో క్రషర్‌ను తొలగించాలి

ఆత్మకూర్‌(ఎస్‌), అక్టోబరు 26: మండల కేంద్రంలో పెద్దగుట్టలో క్రష ర్‌ను తొలగించి, బ్లాసింగ్‌ను  నిలిపివేయాలని అఖిలపక్ష నాయకులు కోరారు.  ఆత్మకూరు(ఎస్‌)లో సర్పంచ్‌ ఇంటిని మంగళవారం  ముట్టడించి వారు మాట్లాడారు. క్రషర్‌  ఏర్పాటు చేసినందున పంట పొలాలు, ఇళ్ల ధ్వంసమవుతున్నాయన్నారు. జిల్లా స్థాయి అధికారులకు గతంలో ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం దారుణమాన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తంగెళ్ల పెదవీరారెడ్డి, చిలుముల గోపాల్‌రెడ్డి, పందిరిమాదవరెడ్డి, డేగల వెంకటకృష్ణ, పోరెండ్ల దశరథ, గునగంటి శ్రీను, దామోదర్‌రెడ్డి, రాంరెడ్డి,పగిడి యల్లయ్య పాల్గొన్నారు


 సర్పంచ్‌ ఇంటి ఎదుటు నిరసన తెలుపుతున్న అఖిలపక్షం నేతలు


 తప్పు చేస్తే ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు

కోదాడటౌన్‌, అక్టోబరు 25: ప్రజా ప్రతినిధులు తప్పు చేస్తే ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదని ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌ అన్నారు. కోదాడలోని తన  క్యాంపు కార్యా లయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మద్యం విక్రయాలకు కొత్తగా ఎవరిని తీసుకురాలేద్దన్నారు.నీతి, నిజాయితీగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీని భూస్థాపితం చేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తనను విమర్శించడం సరికాదన్నారు. సూర్యాపేటలో కారులో కాలిన డబ్బులు ఎక్కడివో ఉత్తమ్‌కుమార్‌ చెప్పాలన్నారు. సొంత ఆస్తులు విక్ర యించి కోదాడలో ఇంటిని నిర్మించుకుంటుంటే, రాజకీయం చేయడం ఉత్తమ్‌కు తగదన్నారు. ఎవరి సత్తా ఏమిటో ప్రజా క్షేత్రంలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. 

కోదాడలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌

రైతుల ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం స్పందించాలి

జిల్లా వ్యాప్తంగా వామపక్షాల నిరసనలు


తిరుమలగిరి, అక్టోబరు 26: దేశ రాజధానిలో రైతులు చేస్తున్న ఉద్య మానికి కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎల్లంల యాదగిరి డిమాండ్‌ చేశారు. తిరుమలగిరిలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల మృతికి కారకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కుమారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎండీ యాకూబ్‌, సోమిరెడ్డి, సుధాకర్‌ పాల్గొన్నారు. 

నేరేడుచర్ల:  ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపూర్‌లో రైతుల మృతి ఘటనలో  కేంద్ర సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ప్రధాన నిందితుడిగా ఉండటం సిగ్గుచేటని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయనాయుడు అన్నారు. అజయ్‌ మిశ్రాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేసి సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించా లన్నారు.  రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిర్వ హించిన  ఽధర్నాలో ఆయన మాట్లాడారు అనంతరం తహసీల్దార్‌ సరితకు వినతి పత్రం అందజేశారు. ఈ  కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రావుల సత్యం, నాయకులు ఎల్లబోయిన సింహా ద్రి, లక్ష్మి, కటికోల వెంకన్న, కొండ అంజయ్య, దాసోజు వెంకటాచారి, రణపంగ శ్రీనివాస్‌, బొడ్డుపల్లి శ్రీను, బాలు, రవీందర్‌రెడ్డి, శివ, గోపి పాల్గొన్నారు.

సూర్యాపేట టౌన్‌: లఖింపూర్‌ కేరీ ఘటనకు బాధ్యులైన కేంద్ర మంత్రి అజయ్‌మిశ్రాను వెంటనే మంత్రి పదవి నుండి బర్తరఫ్‌ చేయాలని వామపక్షాల నాయకులు ములకలపల్లి రాములు,మండారి డేవిడ్‌, కుంట్ల దర్మార్జున్‌, కొత్తపల్లి శివకుమార్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌ ఎదుట వామపక్షాలు,  ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపి మాట్లాడారు.  లఖింపూర్‌ ఘటనలో మృతిచెందిన రైతు కుటుంబాలతో పాటు గాయపడిన వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలన్నారు. రైతాంగ ఉద్య మాన్ని దెబ్బతీయాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. కార్పొరేట్‌ కంపెనీలకు మేలు చేసేందుకే నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మురగుంట్ల లక్ష్మయ్య, కోట రమేష్‌, బుద్ధ సత్యనారాయణ, చామకూరి నర్సయ్య, కొలిశెట్టి యాదగిరిరావు, నవీన్‌, స్వరాజ్యం, రవి, శేఖర్‌, మోహన్‌రెడ్డి, వెంకన్న, కిరణ్‌కుమార్‌, సైదులు, యల్లయ్య, ఆరుట్ల శంకర్‌రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

చిలుకూరు: రైతు వ్యతిరేక  చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ధర్నా చేస్తున్న రైతులకు  ప్రజలు మద్దతుగా నిలబడాలని సీపీఐ అనుబంధ రైత ుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డా వెంకటయ్య కోరారు. మండల కేంద్రంలో మంగళవారం రైతుసంఘం ఆధ్వర్యంలో కోదాడ–హుజూర్‌నగర్‌ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. రైతుల ర్యాలీపై వాహనాన్ని నడిపి రైతుల మృతికి కేంద్ర సహాయమంత్రి కుమారుడు కారకుడు అవడం సిగ్గుచేటన్నారు. ఈ ఘటనకు కేంద్ర సహాయ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.  ఈ కార్యక్రమంలో కస్తూరి సత్యం, పిల్లుట్ల కనకయ్య, మొక్కా లక్ష్మీనారాయణ, అంజయ్య, బెల్లంకొండ ఉపేందర్‌, గంగాధర్‌, దశరధ, రవి, జనార్ధన్‌, నాగేశ్వరరావు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. 

చిలుకూరులో రాస్తారోకో చేస్తున్న రైతుసంఘం నాయకులు 

Updated Date - 2021-10-27T07:14:49+05:30 IST