విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN , First Publish Date - 2021-07-27T06:16:29+05:30 IST

పంట పొలానికి పురుగు మందు పిచికారి చేయడానికి వెళ్లిన రైతు ప్రమా దవశాత్తు విద్యుదాఘాతానికి బలయ్యాడు.

విద్యుదాఘాతంతో  రైతు మృతి
మగ్బూల్‌ మృతదేహం

 పెనుకొండ రూరల్‌, జూలై 26 : పంట పొలానికి పురుగు మందు పిచికారి చేయడానికి వెళ్లిన రైతు ప్రమా దవశాత్తు విద్యుదాఘాతానికి బలయ్యాడు. మం డలంలోని నాగలూరు గ్రామానికి చెందిన మగ్బూల్‌ (50)  కొన్నేళ్ల కిందట బెంగళూరుకు వలస వెళ్లాడు. లాక్‌డౌన్‌తో ఆరు నెలల కిందట స్వగ్రామానికి తిరిగి వచ్చి వ్యవసాయం చేయటం ప్రారంభించాడు. తనకున్న పదెకరాల  పొలం లో రెండెకరాల్లో మొక్కజొన్న సాగుచేశాడు. పంటకు తెగుళ్లు సోకడంతో పవర్‌స్ర్పేయింగ్‌తో పురుగుమందు పిచి కారి చేస్తున్నాడు. ఈ తరుణంలో పవర్‌స్ర్పేయింగ్‌ పంపు బ్యాటరీ వీక్‌ కావడంతో పొలంలోనే ఓ స్టార్టర్‌ బోర్డు నుం చి బ్యాటరీ చార్జింగ్‌ పెట్టుకునే క్రమంలో ప్రమాదవశాత్తు వైరు తగిలి షాక్‌కు గురై కుప్పకూలాడు. సమీప రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృత దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆస్ప త్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 


Updated Date - 2021-07-27T06:16:29+05:30 IST