వ్యవసాయ అధ్యయన కేంద్రాలుగా రైతు వేదికలు

ABN , First Publish Date - 2022-08-08T06:00:57+05:30 IST

రైతు వేదికలు వ్యవసాయ అధ్యయన కేంద్రా లుగా ఉపయోగించుకుని రైతులు అధిక దిగుబడులు సాధించి అభి వృద్ధిలోకి రావాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

వ్యవసాయ అధ్యయన కేంద్రాలుగా రైతు వేదికలు
మాట్లాడుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌

- మంత్రి కొప్పుల ఈశ్వర్‌ 

అంతర్గాం, ఆగస్టు 7: రైతు వేదికలు వ్యవసాయ అధ్యయన కేంద్రా లుగా ఉపయోగించుకుని రైతులు అధిక దిగుబడులు సాధించి అభి వృద్ధిలోకి రావాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఆదివారం మం డల పరిధిలోని సోమనపల్లిలో రైతు వేదికను ప్రారంభించి మంత్రి ఈ మేరకు మాట్లాడారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చం దర్‌ మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ నాయ కత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా, నిరంతర ఉచిత విద్యుత్‌ను అందిస్తూ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తుందని పేర్కొన్నారు. అనంతరం అంతర్గాం మండల కేంద్రంలో నూతనంగా రూ.1.1కోట్లతో నిర్మించిన ఎంపీపీ భవనాన్ని ప్రారంభించి మాట్లాడా రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత ప్రజలకు పరిపాలన సౌల భ్యం కోసం సీఎం కేసీఆర్‌ కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామ పంచా యతీలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే చందర్‌ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమమే లక్ష్యంగా పెద్దఎత్తున నిధులు కేటాయిస్తూ 57 ఏళ్లకే పెన్షన్‌ మంజూరుచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ అనీల్‌ కుమార్‌, జడ్పీటీసీ ఆముల నారాయణ, ఎంపీపీ దుర్గం విజయ, ఎంపీడీవో బీ యాదగిరి, జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, ఏవో రాంబాబు, సర్పంచ్‌ లు కొల్లూరి సత్య, బండారి ప్రవీణ్‌, కుర్ర వెంకటమ్మ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తిరుపతి నాయక్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-08T06:00:57+05:30 IST