పాముకాటుకు రైతు మృతి

ABN , First Publish Date - 2021-12-05T05:24:38+05:30 IST

మండల పరిధిలోని గంగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకటరాముడు (80) శనివారం పాముకాటుకు గురై మృతిచెందాడు.

పాముకాటుకు రైతు మృతి

ముదిగుబ్బ, డిసెంబరు 4: మండల పరిధిలోని గంగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకటరాముడు (80) శనివారం పాముకాటుకు గురై మృతిచెందాడు. కు టుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు..వెంకటరాముడు తన వ్యవసాయ తోటలో పనులు చేసుకుంటుండగా పాము కాటుకు గురై అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం అనంతపురం లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొం దుతూ మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.


Updated Date - 2021-12-05T05:24:38+05:30 IST