
లక్నో: భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ టికాయత్‌ను చంపుతామంటూ అజ్ఞాత వ్యక్తి నుంచి బెదరింపు కాల్స్ రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. టికాయత్ డ్రైవర్ పెర్జ్వల్ త్యాగి దీనిపై సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో సోమవారంనాడు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ముజఫర్‌నగర్ సీనియర్ ఎస్పీ అభిషేక్ యాదవ్ ధ్రువీకరించారు. త్యాగి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించామని తెలిపారు. సీనియర్ సబ్-ఇన్స్పెక్టర్ రాకేష్ శర్మ సారథ్యంలోని పోలీసు బృందం టికాయత్ ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడినట్టు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన మూడు సాగుచట్టాలకు వ్యతిరేకంగా టికాయత్ పోరాటం సాగించగా, ఆ తదుపరి క్రమంలో సాగుచట్టాలను రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.