పరువు ‘బజారు’పాలు

ABN , First Publish Date - 2022-07-02T07:09:07+05:30 IST

జిల్లాలో కొత్త రైతు బజార్ల నిర్మాణం విషయంలో రాష్ట్రప్రభుత్వం పరువు బజారు పాలవుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిదిసార్లు టెండర్లు పిలిచినా వీటిని నిర్మించడానికి ఒక్కరంటే ఒక్క కాంట్రాక్టర్‌ కూడా ముందుకు రాకపోవడం నవ్వులపాలయ్యేలా చేస్తోంది. గతేడాదినుంచి వీటికి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ టెండర్లు పిలు స్తూనే ఉంది.

పరువు ‘బజారు’పాలు

  • జిల్లాలో కొత్త రైతుబజార్ల నిర్మాణం ఇక కలేనా
  • ఇప్పటివరకు ఎనిమిదిసార్లు టెండర్లు పిలిచిన అధికారులు
  • ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాని కాంట్రాక్టర్లు
  • గతేడాది నుంచీ అదేపనిగా టెండర్లు పిలుస్తున్న వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ
  • ప్రభుత్వం బిల్లులు ఎగ్గొడుతుందనే భయంతో ఎవరూ కన్నెత్తి చూడని వైనం
  • కాకినాడరూరల్‌లో 3, జగ్గంపేట, కిర్లంపూడి, ఏలేశ్వరం, తునిలో స్థలాలు సిద్ధం
  • బజార్లలో స్టాళ్ల ఏర్పాటుకు రైతులూ గుర్తింపు: తీరా నిర్మాణాలే అగమ్యగోచరం

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కొత్త రైతు బజార్ల నిర్మాణం విషయంలో రాష్ట్రప్రభుత్వం పరువు బజారు పాలవుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిదిసార్లు టెండర్లు పిలిచినా వీటిని నిర్మించడానికి ఒక్కరంటే ఒక్క కాంట్రాక్టర్‌ కూడా ముందుకు రాకపోవడం నవ్వులపాలయ్యేలా చేస్తోంది. గతేడాదినుంచి వీటికి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ టెండర్లు పిలు స్తూనే ఉంది. ఇలా ఒకటి.. రెండు.. మూడు.. చివరకు ఇప్పుడు ఎనిమిదో సారి వరకు పరిస్థితి వచ్చింది. అయినా ఎవ్వరూ ఇటువైపు చూడడం లే దు. పోనీ కాసులు రావేమో... చిన్న వర్కా అనుకుంటే పొరపాటే.. ఏకం గా ఒక్కోటి రూ.65లక్షల నుంచి రూ.85లక్షల మధ్యలో ఉంది. ఇంత పెద్ద పని చేయడానికి సాధారణంగా కాంట్రాక్టర్లు పెద్దఎత్తున పోటీ పడతారు. కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్‌ అయింది. కాంట్రాక్టు దక్కించుకుని రైతు బజారు నిర్మాణం పూర్తి చేశాక జగన్‌ ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా వేధిస్తుందనే భయంతో ఎవరూ ముందుకు రావడం లేదు.

హవ్వ.. ఎనిమిదిసార్లా..

జిల్లాలో పట్టణాల సంఖ్య ఎక్కువ. వీటిలో నివసించే జనాభా లక్షల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజా కూరగాయలను తక్కువ ధరకు నేరుగా రైతునుంచే కొనుగోలు చేసేవారికి కొదవుండదు. ఈ నేపథ్యంలో 2020లో ప్రజలనుంచి ఏమేర డిమాండ్‌ ఉంటుందనే దానిపై జిల్లా మార్కెటింగ్‌ శాఖ సర్వే జరిపింది. అందులోభాగంగా కొత్తగా జగ్గంపేట, కిర్లంపూడి, తుని, ఏలేశ్వరం, సర్పవరం, రమణయ్యపేట 1, 2, కాకినాడ సిటీలో ఏటిమొగ, తుని తదితర చోట్ల మొత్తం ఏడు రైతుబజార్లు నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం గతేడాది స్థలాలు గుర్తించి అనుమతులు తెచ్చుకుంది. వీటికి మూడు నుంచి అయిదెకరాల వరకు భూములు గుర్తించి రైతుబజార్లు నిర్మించడానికి దాదాపు రూ.7కోట్లతో అంచనాలు రూపొందించింది. జగ్గంపేట కొత్త రైతుబజారు నిర్మాణానికి రూ.67.84 లక్షలు, కిర్లంపూడి రూ.58.17లక్షలు, ఏలేశ్వరం రూ.66.36లక్షలు, ఏటి మొగ, సర్పవరం, రమణయ్యపేట 1, 2 ఈ నాలుగు రైతుబజార్లకు రూ.3.80కోట్లు, తుని రూ.85.61లక్షల చొప్పున ఇంజనీరింగ్‌ అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. రైతుబజార్లు నిర్మాణం పూర్తయితే వెంటనే కూరగాయల విక్రయాలు మొదలవడానికి వీలుగా అధికారులు రైతుల ను గుర్తించారు. ఈ నేపథ్యంలో వీటి నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం గతేడా ది టెండర్లు పిలిచింది. 15 రోజుల వ్యవధిలో ఎవరొకరు టెండర్‌ వేస్తా రని భావించింది. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. ఆ తర్వాత కొన్నిరోజులు వ్యవధి తీసుకుని మళ్లీ టెండర్లు పిలిచింది. అప్పుడు కూడా స్పందన రాలేదు. ఇలా మూడు.. నాలుగు.. ఐదు.. ఆరుసార్లు వరకు టెండర్లు పిలు స్తూనే వచ్చింది. ఈలోపు 2022 వచ్చేసింది. పోనీ ఏడాది దాటిపోవడంతో ఎవరైనా ముందుకు వస్తారేమోననే ఆశతో ఏడోసారి కూడా టెండ ర్లు ఆహ్వానించింది. మళ్లీ అదే నిరాసక్తత పున రావృతమైంది. తాజాగా మళ్లీ ఎనిమిదోసారి పిలిచింది. టెండర్ల దాఖలుకు ఈనెల 13వతేదీ ఆఖరి రోజుగా పేర్కొంది. కానీ మళ్లీ అదే పరిస్థితి తలెత్తే అవకాశం కనిపిస్తోంది. దీంతో అసలు రైతు బజార్ల నిర్మాణం జరుగుతుందా అనే అను మానాలు కలుగుతున్నాయి.

గతంలో అయితే..

వాస్తవానికి కాకినాడ జిల్లా టెండర్‌ వర్కులు అంటే ఒకప్పుడు కాం ట్రాక్టర్లు వాలిపోయేవారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఇతర రాష్ట్రాల నుం చీ టెండర్లు దాఖలయ్యేవి. కానీ ఇప్పుడు అసలు ఏ పనికి టెండర్‌ పిలు స్తున్నా కాంట్రాక్టర్లను ఎప్పటికి వస్తారా? అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడాల్సి వస్తోంది. అయినా ఏ నిరీక్షణ ఇంతవరకు ఫలించలేదు. వాస్తవానికి ఒక్కో రైతు బజారు నిర్మాణానికి రూ.65లక్షల నుంచి రూ.85లక్షల మధ్య వరకు టెండర్‌ పిలిచారు. ఇందులో డబ్బులు బాగానే మిగులుతాయి. అలాంటప్పుడు కాంట్రాక్టర్‌లు టెండర్లు పోటాపోటీగా దాఖలు చేసి ఎగరేసుకుపోవాలి. కానీ జగన్‌ ప్రభుత్వంలో కాంట్రాక్టర్ల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. చేసిన ఏ పనికీ బిల్లులు ఇవ్వకపోవడం తో బయట తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక అనేకమంది రోడ్డున ప డ్డారు. ఈ నేపథ్యంలో ఈ కొత్త రైతుబజార్ల నిర్మాణానికి టెండర్‌లు వేస్తే తమకు ఏగతి పడుతుందోననే భయం కాంట్రాక్టర్లను వేధిస్తోంది. అం దుకే ఎనిమిదిసార్లు టెండర్లు పిలిచే దుస్థితికి ప్రభుత్వం దిగజారినా ఏఒక్కరినుంచి స్పందన ఉండడం లేదు. వాస్తవానికి  కాకినాడ జిల్లాకు 15 వరకు రైతుబజార్ల అవసరం ఉంది. కానీ కాకినాడ నగరంలో రెండు, పెద్దాపురంలో ఒకటి మాత్రమే ఉన్నాయి. కరప, తూరంగి, కాకినాడ నగ రంలోని రాజీవ్‌గృహకల్ప ప్రాంతంలో మూడు ఎన్నో ఏళ్లుగా నిర్మాణ దశ లోనే మూలుగుతున్నాయి. పోనీ కొత్తవి ఏడు నిర్మాణం అవుతాయ నుకుంటే టెండర్ల తీరు చూస్తుంటే ఆశలు ఆవిరయ్యాయి.

Updated Date - 2022-07-02T07:09:07+05:30 IST