రైతులకు ఏం కావాలో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయండి

ABN , First Publish Date - 2022-01-22T04:35:11+05:30 IST

రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, వ్యవసాయ యంత్ర పరికరాలను గుర్తించి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు.

రైతులకు ఏం కావాలో   ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయండి
అధికారులనుద్దేశించి మాట్లాడుతున్న అంబటి కృష్ణారెడ్డి

2023 నాటికి ఆర్‌బీకేలు, గోదాముల నిర్మాణం

ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు రానీయద్దు

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి


నెల్లూరు, (వ్యవసాయం), జనవరి 21 : రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, వ్యవసాయ యంత్ర పరికరాలను గుర్తించి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో శుక్రవారం జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన దొడ్డంరెడ్డి నిరంజనబాబు రెడ్డి అధ్యక్షతన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమీవేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రభుత్వం సరఫరా చేస్తుందని వివరించారు. రాష్ట్రంలో 2023 నాటికల్లా రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు, గోదాముల నిర్మాణం పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు నుంచి నగదు చెల్లింపు వరకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి పొలం వద్దే వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


రైతుల ఇబ్బందులపై స్పందించండి 


ధాన్యం కొనుగోలు సమయంలో రైతులు పడుతున్న ఇబ్బందులపై స్పందించాలని దొడ్డంరెడ్డి నిరంజనబాబురెడ్డి అధికారులకు సూచించారు. ఇటీవల తుఫాను, వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. జిల్లాకు వచ్చే యూరియా అధిక శాతం ఆర్‌బీకేలకు కేటాయించాలని, వరికి మద్దతు ధర కల్పించేలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అంబటిని కోరారు.


246 గ్రూపులకు 2090 పరికరాలు


ఇప్పటివరకు 246 గ్రూపులకు రూ.1494.5 లక్షల 2090 వ్యవసాయ పరికరాలు పంపిణీ చేసి రూ.417లక్షల సబ్సిడీని రైతు గ్రూపు ఖాతాలలో జమ చేసినట్లు జేసీ హరేందిరప్రసాద్‌ వివరించారు. పంటల వివరాలను ఈ-క్రాపింగ్‌ నమోదు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. వరదలు, తుఫానలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారంతోపాటు రాయితీలు అందిస్తున్నామని చెప్పారు. జిల్లాలో 76,500 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం కాగా 94,460 మెట్రిక్‌ టన్నుల యూరియా జిల్లాకు దిగుమతి చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని స్పష్టం చేశారు. 


అంబటి కృష్ణారెడ్డికి సన్మానం


జిల్లాకు 230 వరికోత యంత్రాల కేటాయింపునకు సహకరించిన అంబటి కృష్ణారెడ్డిని నిరంజనబాబురెడ్డి, జేసీ, వ్యవసాయ శాఖ జేడీ వై.ఆనందకుమారి, రోటరీ క్లబ్‌ డిసి్ట్రక్‌ గవర్నర్‌ నాగ సతీ్‌షబాబులు సన్మానించారు.   ఈ సమీక్షలో డీసీఎంఎస్‌ చైర్మన వీరి చలపతి, నెల్లూరు వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ చైర్మన ఏసునాయుడు, పౌరసరఫరాల శాఖ డీఎం పద్మ, మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖల జేడీలు నాగేశ్వరరావు, మహేశ్వరుడు, ఉద్యానశాఖ ఏడీ ప్రదీప్‌, వ్యవసాయ సలహా మండలి సభ్యులు, వ్యవసాయశాఖ డీడీఏలు శివన్నారాయణ, ప్రసాదరావు, ఏడీఏ అనిత, నర్సోజి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T04:35:11+05:30 IST