మొన్న తహసీల్‌ ఎదుట ఇప్పుడు ఎస్పీ కార్యాలయం ముందు

ABN , First Publish Date - 2021-07-27T04:19:47+05:30 IST

ఇటీవలే ఓ వ్యక్తి తమ భూమిని ఇతరులు ఆక్రమించారని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేసినా, సర్వే అధికారి రూ.60 వేలు లంచం అ డగడంతో ఏకంగా తహసీల్దార్‌ కార్యాలయం ముందు పురుగు మందు తాగాడు.

మొన్న తహసీల్‌ ఎదుట ఇప్పుడు ఎస్పీ కార్యాలయం ముందు
పురుగుల మందుతో నిరసన తెలుపుతున్న ఈరన్న

- పురుగుల మందుతో ఆత్మహత్యాయత్నానికి వచ్చిన రైతు

- ఎస్‌ఐ వేధిస్తున్నారని ఫిర్యాదు


గద్వాల క్రైం, జూలై 26 : ఇటీవలే ఓ వ్యక్తి తమ భూమిని ఇతరులు ఆక్రమించారని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేసినా, సర్వే అధికారి రూ.60 వేలు లంచం అ డగడంతో ఏకంగా తహసీల్దార్‌ కార్యాలయం ముందు పురుగు మందు తాగాడు. మళ్లీ అదే సమస్యపై ఎస్‌ఐ వేధిస్తున్నాడని ఎస్పీ కార్యాలయం ముందు పురుగు మందుతో నిరసన తెలిపిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకున్నది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

 మల్దకల్‌ మండలం మద్దెలబండ గ్రామ శివారులో సర్వే నంబర్‌ 64/ఈ/3/2, 64/ఆ2/2లో 3-16 ఎకరాల పొలం తాను, తన తమ్ముళ్ల పేరుతో ఉన్నదని, ఇందుకు సంబంధించి కొత్తపాస్‌పుస్తకాలు, రైతుబంధు చెక్కులు కూడా తమకే ఇచ్చారని రైతు ఈరన్న తెలిపారు. తమ పొలంలో 2015 వరకు తామే ఉన్నామని, 2016, 2017లలో బతకడానికి అలంపూర్‌ మండలం ఉండవల్లికి వెళ్లామని తిరిగి 2018లో గ్రామానికి రా గా తమ పొలాన్ని రాములు నాయక్‌ కబ్జా చే శారన్నారు. ఈ విషయంపై ఇప్పటి వర కు ఏడు సార్లు ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. ఈ విషయమై మార్చిలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేయగా, సర్వే చేయాలని ఆదేశాలు రావడం తో జూలైలోనే మల్దకల్‌ తహసీల్దార్‌ ఆదేశాల మేరకు సర్వేయర్‌ బ్రహ్మయ్య సర్వే చేశా డని అన్నారు. అయితే, ఆ పొలం తమదే అని చెప్పినా రిపోర్టు ఇవ్వడానికి రూ.60 వే లు లంచం అడిగితే తహసీల్దార్‌ కార్యాలయం ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మ హత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పాడు. ఇప్పుడు మల్దకల్‌ ఎస్‌ఐ ఈ పొలం నీది కాదని, ఎందుకు నీవు వస్తున్నావని తమపై దుర్భాషలాడుతూ దాడి చేస్తున్నారని ఆరో పించాడు. తమ పొలంలో పశువులను కట్టేసి అక్కడే ఉంచిన ఓ బాలుడిని కూడా ఎస్‌ ఐ శేఖర్‌ విచక్షణారహితంగా కొట్టినట్లు చెప్పాడు. దీంతో గత్యంతరం లేక పురుగు          మందుతో ఎస్పీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్నట్లు బాధితులు ఈరన్న, కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఎస్పీకి వినతిపత్రం అందించారు. దీనిపై స్పందించిన ఆయన విచారణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఈ విషయంపై ఎస్‌ఐ శేఖర్‌ను వివరణ కోర గా ఈరన్న కుటుంబ సభ్యులపై దాడులు చే యలేదని, ఇది అవాస్తవమన్నారు.

Updated Date - 2021-07-27T04:19:47+05:30 IST