రైతులకు మద్దతు ధర సొమ్ములు చెల్లించాలి

ABN , First Publish Date - 2021-05-09T05:41:58+05:30 IST

ఆరుగాలం కష్టించి పండించిన పంటకు మద్దతు ధర లేకుండా ప్రభుత్వం రైతును మోసగించిందని, ఇప్పటికే రైతులు 70శాతం ధాన్యాన్ని అయినకాడికి అమ్మకున్నారని వారందరికీ ప్రస్తుతం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.1401 చొప్పున చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు.

రైతులకు మద్దతు ధర సొమ్ములు చెల్లించాలి

అనపర్తి, మే 8: ఆరుగాలం కష్టించి పండించిన పంటకు మద్దతు ధర లేకుండా ప్రభుత్వం రైతును మోసగించిందని, ఇప్పటికే రైతులు 70శాతం ధాన్యాన్ని అయినకాడికి అమ్మకున్నారని వారందరికీ ప్రస్తుతం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.1401  చొప్పున చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం అనపర్తిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల కష్టా లపై  స్పందించి తాము చేసిన పోరాటానికి అధికారులు ఇప్పడు స్పందిం చా రని, ఇప్పటికే  జరగాల్సిన అన్యాయం జరిగిందన్నారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ప్రకటించిన విధంగా ఇప్పటివరకు రైతులు అమ్ముకున్న ధాన్యానికి కనీస మద్దతు ధర ప్రకారం చెల్లించి వారి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఇప్ప టికే రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వైసీపీ రైతులను ఇంతలా మోసం చేయడం సరికాదన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు కర్రి వెంకటరామారెడ్డి, ఒంటిమి సూర్యప్రకాష్‌, పులగం అచ్చిరెడ్డి, నల్లమిల్లి  సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-09T05:41:58+05:30 IST