వ్యవసాయ యాంత్రీకరణ

ABN , First Publish Date - 2020-08-08T09:44:30+05:30 IST

వ్యవసాయ సాగులో యాంత్రీకరణకు అధికార యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది.

వ్యవసాయ యాంత్రీకరణ

ఆర్‌బీకేలో ఐదుగురు రైతులతో గ్రూపు ఏర్పాటు

సబ్సిడీపై యంత్ర పరికరాలు అందజేత

కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌లో అద్దెకు ఇవ్వొచ్చు

కార్యాచరణ సిద్ధం చేస్తున్న అధికారులు


ఏలూరు సిటీ, ఆగస్టు 7 : వ్యవసాయ సాగులో యాంత్రీకరణకు అధికార యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. రైతు భరోసా కేంద్రాలలో యం త్ర పరికరాలను రైతులకు అద్దెకు ఇచ్చేవిధంగా ప్రత్యేక ఏర్పాటు చేసింది. జిల్లాలోని 938 రైతు భరోసా కేంద్రాల్లో ఐదుగురు రైతులతో గ్రూపు ఏర్పాటు చేస్తారు. ఆయా గ్రూపులకు సబ్సిడీ, బ్యాంకు రుణ సదుపాయంతో యంత్ర పరికరాలు అందజేస్తారు. వారు సాగుకు ఉపయోగించుకుంటూనే ఇతర రైతులకు అద్దెకు ఇచ్చుకునేందుకు రైతు భరోసా కేంద్రంలోనే కస్టమ్‌ హై రింగ్‌ సెంటర్‌ ఏర్పాటు కానుంది.


ఒక్కొక్క రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతు గ్రూపునకు రూ.12 లక్షల విలువైన పరికరాలు అందజేయ నున్నారు. ఒక్కొక్క రైతు భరోసా కేంద్రంలో ఒక రైతు గ్రూపు ఏర్పాటు చేస్తా రు. స్థానిక వ్యవసాయ అధికారులు గ్రూపుల ఏర్పాటు బాధ్యత తీసుకుం టారు. ఒక్కొక్క గ్రూప్‌లో ఐదుగురు రైతులను సభ్యులుగా ఎంపిక చేస్తారు. ఆయా ప్రాంతాల్లో చురుగ్గా పనిచేసే వారికి, యంత్ర పరికరాల వినియో గంలో అనుభవం వున్న రైతులతో గ్రూపులు ఏర్పాటుచేసే అవకాశం ఉంది. 


సబ్సిడీపై యంత్రాలు

రైతు భరోసా కేంద్రాలలో ఏర్పాటు చేసిన రైతు గ్రూపులకు 40 శాతం సబ్సిడీపై రూ.12 లక్షల విలువైన పరికరాలను అందజేస్తారు. రైతు గ్రూపు పది శాతం, 50 శాతం బ్యాంక్‌ రుణ సదుపాయంతో ఆధునిక యంత్రాలు కొనుగోలు చేసుకోవచ్చు. ఆయా గ్రూపులు యంత్రాలను వినియోగిస్తూనే కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల ద్వారా ఇతర రైతులకు అద్దెకు ఇవ్వవచ్చు. సార్వా సీజన్‌ ప్రారంభం కావడంతో ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణపై దృష్టి సారించింది. మార్గదర్శకాలు విడుదల వెంటనే పరికరాలను అందజేసే ఏర్పాట్లు చేస్తారు.

Updated Date - 2020-08-08T09:44:30+05:30 IST