రైతువేదిక భవనాలను త్వరగా నిర్మించాలి

ABN , First Publish Date - 2020-08-08T06:05:53+05:30 IST

రైతువేదిక భవన నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని కలెక్టర్‌ భారతిహోళికేరి అన్నారు.

రైతువేదిక భవనాలను త్వరగా నిర్మించాలి

కలెక్టర్‌ భారతిహోళికేరి


చెన్నూర్‌, ఆగస్టు 7: రైతువేదిక భవన నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని కలెక్టర్‌ భారతిహోళికేరి అన్నారు. శుక్రవారం కిష్టంపేటలో నిర్మిస్తున్న  నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు నిర్మాణ దశలోనే ఉండడంతో అధికారు లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సెప్టెంబర్‌ 20వ తేదీలోగా నిర్మాణాలను పూర్తి చేయాలని  అధికారులను ఆదేశించారు. శ్మశానవాటిక, డంపింగ్‌ యార్డ్‌లను త్వరితగతిన నిర్మించాలని కోరారు. పల్లె ప్రగతి కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు. కరోనా విజృంభిస్తున్నందున వైద్య సిబ్బంది గామ్రాల్లో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. డీఏఓ వినోద్‌కుమార్‌, ఏడీఏ బాపు, పంచాయతీరాజ్‌ డీఈస్వామిరెడ్డి, ఏవో మహేందర్‌, ఏఈఓ అంజలి, సర్పంచ్‌ రాకేష్‌గౌడ్‌ ఉన్నారు. 


అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి

కోటపల్లి: రైతు వేదికల నిర్మాణాల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని కలె క్టర్‌ భారతి హొళికేరి హెచ్చరించారు. శుక్రవారం సిర్సా, వెల్మపల్లి గ్రామాల్లో నిర్మి స్తున్న రైతు వేదికలను ఆమె పరిశీలించారు. సిర్సాలో గుంతలు మాత్రమే తవ్వి  ఉండటంతో కలెక్టర్‌ అసహనానికి గురయ్యారు. ఇదేనా నిర్మాణం తీరు అంటూ సర్పంచ్‌ మధుసూదన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వెల్మపల్లిలోనూ పిల్లర్ల దశలో ఉండగా పనులు త్వరగా చేయాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరిపి నివేదిక అందించాలన్నారు. ఎంపీడీఓ లక్ష్మయ్య, ఏవో మహేందర్‌, రైతుబం ధు కోఆర్డినేటర్‌ గుర్రం రాజన్న, ఎంపీఓ సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. 


అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి 

లక్షెట్టిపేట రూరల్‌: రైతువేదిక నిర్మాణం పనులు, పల్లె ప్రగతి అభివృద్ధి పనుల ను వేగవంతంగా పూర్తి చేయాలని డీఆర్‌డీఓ శేషాద్రి పేర్కొన్నారు. సూరారం లో నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణ పనులను, తిమ్మాపూర్‌లో ప్రకృతివనాన్ని పరిశీలించా రు. ఎంపీడీఓ సత్యనారాయణ, ఎంపీఓ అజ్మత్‌ అలీ, సర్పంచ్‌లు శంకరయ్య, రవి పాల్గొన్నారు. 


జైపూర్‌ : రైతువేదిక నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆర్డీవో రమేష్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఇందారం, జైపూర్‌, కిష్టాపూర్‌ గ్రామాల్లో నిర్మాణ పనులు పరిశీలించారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. తహసీల్దార్‌ ప్రసాద్‌వర్మా, ఎంపీడీవో కే.నాగేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ పోశన్న, ఆర్‌ఐ కమల, వీఆర్‌వో పద్మజా, పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-08T06:05:53+05:30 IST