రైతు వేదికలు కర్షక దేవాలయాలు : రవీంద్రకుమార్‌

Jun 17 2021 @ 00:24AM
రైతువేదిక భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌

చింతపల్లి, జూన 16 : రైతు వేదికలు కర్షక దేవాలయాలని  ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని నెల్వలపల్లి, చింతపల్లిలో నూతనంగా నిర్మించిన రైతువేదికలు ప్రారంభించారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో మం డలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన 65మంది లబ్ధిదారు లకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. రైతులకు రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే  దక్కిందన్నారు. పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం ఎంతో దోహదపడుతోందన్నారు. రైతులు రైతువేదికలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మహిళా స్టాండింగ్‌ కమిటీ జిల్లా చైర్మన కంకణాల ప్రవీణవెంకట్‌రెడ్డి, ఎంపీపీ కొండూరు భవానిపవనకుమార్‌, ఆర్‌ఎ్‌సఎస్‌ మండల కోఆర్డినేటర్‌ వి.విద్యాసాగర్‌రావు, సింగిల్‌ విండో చైర్మన లింగంపల్లి వెంకటయ్య, సర్పంచలు శ్రీనివా్‌సరెడ్డి, ముచ్చర్ల యాదగిరి, ఎంపీటీసీలు బూరుగు ధనమ్మమల్లయ్య, నల్లవెల్లి సదానందం, ఎల్లంకి వరలక్ష్మీఅశోక్‌, టీఆర్‌ఎస్‌ మండల  అధ్యక్షుడు నట్వ గిరిధర్‌, తహసీల్దార్‌ విశాలాక్ష్మి, ఎంపీడీవో ఎల్‌.రాజు, వెలుగు ఏపీఎం విజయలక్ష్మి, టీఆర్‌ఎస్‌ రాష్ట్రనేత కంకనాల వెంకట్‌రెడ్డి, మాస భాస్కర్‌, ఎల్లంకి అశోక్‌ తదితరురలు పాల్గొన్నారు. 


Follow Us on: