రైతు సంక్షేమమే సర్కారు ధ్యేయం: మంత్రి

ABN , First Publish Date - 2021-03-09T06:00:48+05:30 IST

మహిళల సమగ్రాభివృద్ధి, రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు.

రైతు సంక్షేమమే సర్కారు ధ్యేయం: మంత్రి
సారంగాపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అల్లోల

నిర్మల్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మహిళల సమగ్రాభివృద్ధి, రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. అం తర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం నిర్మల్‌ జిల్లాకేంద్రంలోని దివ్యగార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని.. మాట్లాడారు. అనంత రం పలు రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళలను మంత్రి సన్మానించారు. 

ప్రతిభ పురస్కారానికి ముథోల్‌ సరస్వతి సమాఖ్య సంఘం ఎంపిక

ముథోల్‌ :  ముథోల్‌ మండల సరస్వతీ సమాఖ్య సంఘం ప్రతిభ అవార్డు పుర స్కారానికి ఎంపికైంది. సోమవారం మంత్రి అవార్డు అందజేశారు.

రైతు వేదిక ప్రారంభం..

సారంగాపూర్‌: రైతు సంక్షేమమే సర్కారు ధ్యేయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. సోమవారం బీరవెల్లిలో నిర్మించిన రైతు వేదికను ప్రారం భించిన అనంతరం మాట్లాడారు. రైతుల కోసం పలు పథకాలను ప్రవేశపెట్టారన్నారు. కౌట్ల(బి)లో రెడ్డి యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్‌ టోర్నీలో విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో అల్లోల మురళీధర్‌ రెడ్డి, జడ్పీ చైర్మన్‌ కొరిపెల్లి విజయలక్ష్మి రాంకిషన్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్‌ వెంకట్‌ రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌ రెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్‌ రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌ రెడ్డి, అడెల్లి దేవాలయం చైర్మన్‌ ఐటీ చందు, అడెల్లి పోచమ్మ దేవాలయం మాజీ చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు.

నిర్మల్‌ టౌన్‌: పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని మంత్రి అల్లోల అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్‌ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో భూమి కొనుగోలు పథకం కింద మంజూరైన 3 ఎకరాల వ్యవసాయ సాగు భూము లకు మొదటి పంట పెట్టుబడి సహాయం కింద చెక్కును పంపిణీ చేశారు. కార్యక్ర మంలో జిల్లా షెడ్యూల్‌ కులాల సేవా సహకార సంస్థ అధికారి హన్మాండ్లు, రాంకిషన్‌ రెడ్డి, తహసీల్దార్‌ శ్రీకాంత్‌, అధికారులు, రైతులు పాల్గొన్నారు. 

అటవీశాఖ అధికారుల కృషి ప్రశంసనీయం

నిర్మల్‌ కల్చరల్‌: దేశంలోనే ఎక్కువ మొక్కలు నాటిన ఘనత తెలంగాణదేనని కేంద్రం ప్రకటించడం హర్షణీయమని మంత్రి అన్నారు. అటవీ, ఇతర అధికారుల కృషి ప్రశంసనీయమని అన్నారు. కేంద్ర అటవీశాఖ సహాయ మంత్రి బాబుల్‌ సుప్రియో పార్లమెంట్‌లో ప్రకటించడం జరిగిందని తెలిపారు. 

Updated Date - 2021-03-09T06:00:48+05:30 IST