వ్యవసాయం చేస్తూ ఏడాదికి రూ.25 లక్షల సంపాదిస్తున్న వ్యక్తి విషయంలో షాకింగ్ ఘటన.. ఇంతలోనే ఇలా జరిగిపోయిందేంటి..?

ABN , First Publish Date - 2022-10-04T20:58:44+05:30 IST

తనకున్న మూడు ఎకరాల భూమిలో పాలీ హౌస్‌ను ఏర్పాటు చేసి సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఏటా దాదాపు 25 లక్షల రూపాయలు

వ్యవసాయం చేస్తూ ఏడాదికి రూ.25 లక్షల సంపాదిస్తున్న వ్యక్తి విషయంలో షాకింగ్ ఘటన.. ఇంతలోనే ఇలా జరిగిపోయిందేంటి..?

తనకున్న మూడు ఎకరాల భూమిలో పాలీ హౌస్‌ను ఏర్పాటు చేసి సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఏటా దాదాపు 25 లక్షల రూపాయలు సంపాదిస్తున్న అల్వార్‌‌కు చెందిన రైతు జితేంద్ర సైనీ (40) హత్యకు గురైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పక్క గ్రామానికి చెందిన ఓ కుటుంబంతో జితేంద్రకు చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. వారే జితేంద్రను హత్య చేసి ఉంటారని అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 


ఇది కూడా చదవండి..

19 ఏళ్ల కూతురికి మూగ, చెవుడు.. ఒంటరిగా ఇంట్లో ఉంచి పొలానికి వెళ్లడమే ఆ తల్లి తప్పయింది.. తిరిగొచ్చేసరికి ఏం జరిగిందంటే..


ఉద్యోగాన్ని వదులుకున్న జితేంద్ర వ్యవసాయం ప్రారంభించి దాన్ని లాభసాటిగా మార్చాడు. కృత్రిమ ఎరువులు కాకుండా.. ఆవు పేడ, పాలు, మజ్జిగ, పసుపుతో సహా వివిధ రకాల మట్టి, బెల్లంతో చేసిన మిశ్రమాలను ఎరువులుగా వాడుతున్నాడు. వివిధ వ్యవసాయ సంస్థల నుంచి శిక్షణ తీసుకుని సేంద్రీయ ఎరువులతో వ్యవసాయం చేస్తూ, అద్భుమైన మార్కెటింగ్ టెక్నింగ్‌తో నెలకు దాదాపు రూ.2 లక్షలు సంపాదిస్తున్నాడు. స్థానికంగా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. నెలన్నర క్రితం అల్వార్ జిల్లా కలెక్టర్ కూడా జితేంద్ర ఫార్మ్‌ను సందర్శించారు. జితేంద్రను ప్రశంసించారు. 


45 రోజులు తిరగకుండానే జితేంద్ర ఊరి చివర చెరువులో విగత జీవిగా మారాడు. సమాచారం అందుకున్న జితేంద్ర సోదరుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. జితేంద్ర సోదరుడి అనుమానం మేరకు పక్క గ్రామానికి చెందిన వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. 


Updated Date - 2022-10-04T20:58:44+05:30 IST