భార్య ఇంకా అన్నం తిసుకురాలేదేంటా..? అని పొలానికి కాపలా ఉన్న భర్తకు డౌట్.. రాత్రి పూట ఇంటికెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2021-11-18T12:09:35+05:30 IST

రాజస్థాన్‌లోని రాజస్మంద్ నగర సమీపంలోని గ్రామంలో ఒక మహిళను చాలా కిరాతకంగా చంపి.. శవాన్ని పక్కనే ఉన్న అడవి ప్రాంతంలో పడేశారు. ఆ హత్యకేసుని ఛేదించిన పోలీసులకు మరో నేరం గురించి తెలిసింది. ఒక నేరాన్ని కప్పి పుచ్చడానికి మరో నేరంగా హత్య...

భార్య ఇంకా అన్నం తిసుకురాలేదేంటా..? అని పొలానికి కాపలా ఉన్న భర్తకు డౌట్.. రాత్రి పూట ఇంటికెళ్లి చూస్తే..

రాజస్థాన్‌లోని రాజస్మంద్ నగర సమీపంలోని గ్రామంలో ఒక మహిళను చాలా కిరాతకంగా చంపి.. శవాన్ని పక్కనే ఉన్న అడవి ప్రాంతంలో పడేశారు. ఆ హత్యకేసుని ఛేదించిన పోలీసులకు మరో నేరం గురించి తెలిసింది. ఒక నేరాన్ని కప్పి పుచ్చడానికి మరో నేరంగా హత్య చేశారని పోలీసులు చెబుతున్నారు.


రాజస్మంద్ నగర సమీపంలో ఉన్న అమరతియా గ్రామంలో నివసించే జీవారామ్(50) అనే రైతు రాత్రి పొలంలో తన భార్య కంకుబాయి(45) కోసం ఎదురు చూస్తుండగా.. ఆమె భోజనం తీసుకొని ఎంతసేపటికీ రాలేదు. కంకుబాయిని వెతుకుతూ జీవారామ్ బయలుదేరాడు. గ్రామస్తులందరినీ తన భార్య గురించి అడిగాడు. జీవారామ్‌తో కలిసి అతని బంధులు కంకుబాయ్ కోసం ఎంత ప్రయత్నించినా ఆమె దొరకలేదు. తెల్లవారుఝామున పక్కనే ఉన్న అడవి ప్రాంతంలో కంకుబాయ్ శవం దొరికింది. ఆమె శవానికి కాళ్లు లేవు. ముందు అంతా ఇదేదో జంతువు చేసిన పనిగా అనుకున్నారు. కానీ ఆమె కాళ్లు ఏదో గొడ్డలితో నరికిన విధంగా కనిపించాయి.


హత్య సమాచారం అందుకున్న పోలీసులు కంకుబాయ్ శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.  పోలీసులు విచారణలో కొందరు గ్రామస్తులు జీవారామ్ పొలం కంటే ముందుగా వచ్చే పొలం వద్ద ఆరోజు రాత్రి ఒక యువకుడిని చూసినట్లు చెప్పారు. ఆ యువకుడు పక్క గ్రామంలో నివసించే గోపి అని తెలిసింది. పోలీసుల అనుమానంతో గోపి కోసం వెతికారు. చివరికి ఎలాగోలా అతడిని పట్టుకున్నారు. 


గోపిని పోలీసులు తమ పద్ధతిలో ప్రశ్నించగా.. అతను నిజం ఒప్పుకున్నాడు. కంకుబాయ్ చనిపోయిన రాత్రి తాను జీవారామ్ పొలం సమీపంలోని మరో పొలం వద్ద తన ప్రేయసితో ఉన్నానని.. గోపి చెప్పాడు. కంకుబాయ్ ఇద్దరు ప్రేమికులని శృంగారం చేసుకుంటుండగా చూసిందని, ఈ విషయం బయట ఎక్కడా ఆమె చెప్పకముందే ఆమెను చంపాల్సి వచ్చిందిని తెలిపాడు. మరి కంకుబాయ్ కాళ్లు ఎందుకు నరికావు? అని పోలీసుల ప్రశ్నించగా.. కంకుబాయ్ కాళ్లకి పెద్ద పెద్ద కడియాలు, గజ్జెలు తీసుకునేందుకు ఆమె కాళ్లు నరికానని ఒప్పుకున్నాడు. దొంగలు ఈ హత్య చేశారని పోలీసులను నమ్మించడానికే అలా చేశానని తన నేరం ఒప్పుకున్నాడు.


Updated Date - 2021-11-18T12:09:35+05:30 IST