జనవరి 4 నుంచి రైతు ఆవేదన యాత్ర: షర్మిల

ABN , First Publish Date - 2022-01-01T01:20:12+05:30 IST

జనవరి 4 నుంచి రైతు ఆవేదన యాత్ర చేపడుతున్నట్లు వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ప్రకటించారు.

జనవరి 4 నుంచి రైతు ఆవేదన యాత్ర: షర్మిల

హైదరాబాద్: జనవరి 4 నుంచి రైతు ఆవేదన యాత్ర చేపడుతున్నట్లు వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వడ్లు కొనకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. కేసీఆర్‌ ఏడేళ్ల పాలనలో 7 వేల మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని, గత 70 రోజుల్లోనే 200 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. కేసీఆర్ నిరంకుశ పాలనతో బంగారు తెలంగాణను రైతులకు బతుకేలేని తెలంగాణగా మారుస్తున్నారని దుయ్యబట్టారు. రైతుల మృతికి కారణమౌతున్న కేసీఆర్ ఇకనైనా పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. వరి కొనుగోలు చేయడంతో పాటు యాసంగి వరి పండించేందుకు.. రైతులకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.

Updated Date - 2022-01-01T01:20:12+05:30 IST