వేరుశనగ విత్తన సాగులో రైతులు బిజీబిజీ

ABN , First Publish Date - 2022-06-25T06:03:11+05:30 IST

పల్లెల్లో వేరుశనగ విత్తనసాగులో రైతులు బిజీబీజీగా గడుపుతున్నారు. మండలవ్యాప్తంగా గతవారం కురిసిన వర్షాలకు ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధమయ్యారు.

వేరుశనగ విత్తన సాగులో రైతులు బిజీబిజీ
చిగిచెర్ల వద్ద వేరుశనగ విత్తుతున్న రైతులు

ధర్మవరంరూరల్‌, జూన24: పల్లెల్లో వేరుశనగ విత్తనసాగులో రైతులు బిజీబీజీగా గడుపుతున్నారు. మండలవ్యాప్తంగా గతవారం కురిసిన వర్షాలకు ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధమయ్యారు.  ముందస్తుగా వర్షాలు కురిసి పదును కావడంతో రైతులు ఇదివరకే సేద్యపుపనులు చేసుకున్నారు. దీంతో సాగుకు సిద్ధం చేసిన పొలాల్లో రైతులు విత్తన సాగుచేస్తూ బిజీగా గడుపు తున్నారు. ఇదివరకే బోరుబావుల కింద మండల వ్యాప్తంగా వేరుశనగ సాగు చేశారు.  గతేడాది మండలవ్యాప్తంగా 14వేల హెక్టార్లులో వేరుశనగ సాగుచే శారు. వేరుశనగ పంట పూర్తిగా నష్టపోవడంతో ఈ ఏడాది వేరుశనగ సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉందని రైతులు తెలుపుతున్నారు. దీంతోపాటు పెట్టుబడులు భారం తట్టుకోలేక మరికొంతమంది రైతులు కంది, ఆముదం, అలసంద, సాగు చేస్తున్నారు. 


Updated Date - 2022-06-25T06:03:11+05:30 IST