ధరణితో రైతులకు శాపం

ABN , First Publish Date - 2022-09-25T05:39:13+05:30 IST

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెటి ్టన ధరణి పోర్టల్‌ రైతులకు శాపంగా మారిందని బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్‌ అన్నారు.

ధరణితో రైతులకు శాపం
మాట్లాడుతున్న బీజేపీ నాయకుడు శాంతకుమార్‌

- బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్‌

కోయిలకొండ, సెప్టెంబరు 24 : తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెటి ్టన ధరణి  పోర్టల్‌ రైతులకు శాపంగా మారిందని బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్‌ అన్నారు. శని వారం మండలంలోని కొత్లాబాద్‌, సూరారం, బూర్గుపల్లి, కాజిపూర్‌ గ్రామాల్లో ప్రజాగోస బీజేపీ భరోసా అనే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రైతులను అన్ని విధాలుగా ఆదు కుంటామన్న ప్రభుత్వం వారికి తీవ్ర నష్టం చేసిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అమ లుచేస్తున్న పథకాలను రైతులకు అందకుండా చేసి నష్టపరుస్తున్నారని ఆరోపించారు. వారు చేస్తున్న అవినీతి మూలంగా రాష్ట్రం రూ.5 లక్షల కోట్ల అప్పు చేయాల్సి వచ్చిందని విమర్శిం చారు. దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రజలు గమనించి వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నారాయ ణపేట జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, నారాయణసేట ఇన్‌చార్జి రతంగ్‌పాండురెడ్డి, మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, నాయకులు రాములుగౌడ్‌, శ్రీహరి, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-25T05:39:13+05:30 IST